పట్టణాల్లో నివసించే వారికి డీమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇంటి అవసరాల సరుకులు తక్కువ ధరకే దొరుకుతాయని భావిస్తూ, సాధారణ కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు చాలా మంది డీమార్ట్ స్టోర్లలో షాపింగ్ చేస్తుంటారు. పండుగ సీజన్‌లలో అయితే ఈ రద్దీ మరింత రెట్టింపు అవుతుంది. ఈ స్థాయిలో డీమార్ట్ వ్యాపారం ఎంత బలంగా ఉందో చెప్పకనే తెలుస్తుంది.
అయితే, ఇటీవల జియోమార్ట్ వైపు కూడా ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో జియోమార్ట్‌లో డీమార్ట్ కంటే మరింత చవకగా సరుకులు లభిస్తున్నాయి. డీమార్ట్‌లో ఆన్‌లైన్ ఆర్డర్లకు ఒక నిర్దిష్ట మొత్తానికి చేరేవరకు డెలివరీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ జియోమార్ట్‌లో రూ.200 పైబడితే డెలివరీ ఉచితంగా లభిస్తుంది.
ఉదాహరణకు, హిమాలయ బేబీ లోషన్ (400ml) జియోమార్ట్‌లో సుమారు రూ.206 ఉంటే, అదే డీమార్ట్‌లో రూ.230 వరకు ఉండొచ్చు. ఈ ధరలు స్టాక్, ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. డీమార్ట్‌లో కొన్నిసార్లు డెలివరీ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ జియోమార్ట్‌లో ఎక్కువగా గంటలోపే సరుకులు ఇంటికి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో 10–30 నిమిషాల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.
జియోమార్ట్‌లో వస్తువుల కలెక్షన్ డీమార్ట్ కంటే ఎక్కువ. వంట సరుకులపై ఆఫర్లు బాగా ఉంటాయి. యాప్ కూడా సింపుల్‌గా, ఈజీగా వాడుకునేలా ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఉండటం వల్ల మనకు నచ్చినది ఈజీగా పిక్ చేసుకోవచ్చు.
డీమార్ట్ సేవలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ జియోమార్ట్ దాదాపు అన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో ఇండిపెండెన్స్ డే సేల్ కొనసాగుతోంది. ఎంపిక చేసిన వస్తువులపై 80% వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
కాబట్టి షాపింగ్ చేయడానికి ముందుగా డీమార్ట్ రెడీ యాప్, జియోమార్ట్ యాప్ రెండింటినీ ఇన్‌స్టాల్ చేసి, లాగిన్ అయి, మీ లిస్ట్‌లో కావాల్సిన వస్తువులు యాడ్ చేసి, ధరలను పోల్చుకోవడం మంచిది. ఎక్కడ మంచి డీల్ దొరుకుతుందో అక్కడ కొనుగోలు చేస్తే డబ్బు సేవ్ అవుతుంది, ఆఫర్లు కూడా మిస్ కావు.