తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. ఆగస్టు 13 నుంచి బంగాళాఖాతంలో కొత్తగా ఒక అల్పపీడనం (LPA) ఏర్పడనుంది.
ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ వర్షాల ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా పడనుంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 10న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, రేపు (ఆగస్టు 11) ఈ ప్రభావం 19 జిల్లాలకు విస్తరించనుంది. దాదాపు మొత్తం రాష్ట్రంలో వర్షం ప్రభావం కనిపించేలా వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే ఐదు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అంతేకాదు, ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకటి రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పబడింది.
స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున కూడా వర్షాలు జోరుగా కురిసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున బయటకు వెళ్లే ప్లాన్ ఉంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.