Cyclone Alert: రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం సముద్రతీరంలో ఈ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 17.54 ఎకరాల భూమిని గుర్తించగా, 38 ఇళ్లకు పునరావాసం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏపీ మారిటైం బోర్డు అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించగా, స్థానికులు ఇళ్లకు నష్టం జరగకుండా భూసేకరణ చేపట్టాలని కోరారు. దీనిపై రెవెన్యూ అధికారులు కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు.

Election Commission: ఈసీ సంచలనం..! 334 రాజకీయ పార్టీలపై వేటు!

ఈ ప్రాంతంలో దాదాపు 20 వేల మంది మత్స్యకారులు చేపల వేటనే జీవనాధారంగా కొనసాగిస్తున్నారు. వీరి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.392.24 కోట్లు మంజూరు చేసి, కె.పల్లెపాలెం వద్ద స్థల పరిశీలన జరిపింది. అయితే సముద్ర తీరాన ఇళ్లు ఉండటంతో స్థానికుల నుంచి వ్యతిరేకత రావడం, 2019లో ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

Liquor Scam: మద్యం కుంభకోణంలో భూమన కీలక పాత్ర! లిక్కర్ లాబీకి లాయర్‌గా..!

తర్వాత వైసీపీ ప్రభుత్వం హయాంలో హార్బర్ స్థలాన్ని పల్లెపాలెం నుంచి మార్చి, పాదర్తి, పిన్నికవారిపాలెం, రంగాయపాలెం ప్రాంతాలను పరిశీలించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా, భూసేకరణ జాప్యం, నిధుల కొరతతో పనులు ముందుకు సాగలేదు.

Green Toamtoes: బరువు తగ్గాలా? అయితే దీనిని ఆహారం లో భాగం చేసేయండి!

ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మళ్లీ మొదటి ప్రణాళిక ప్రకారం కె.పల్లెపాలెం వద్దే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం చర్యలు వేగవంతం చేస్తున్నారు.

ICICI: ICICI కొత్త కస్టమర్లకు షాక్.. మంత్లీ బ్యాలెన్స్!
APL: క్రికెట్ హంగామా స్టార్ట్ – APL సీజన్-4కి ఘన ఆరంభం!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ లింక్ ఖాతాల్లోకి!
Asus: రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు! తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు!
Post Office Scheme: నెలకు ₹20,000 పైగా ఆదాయం! రిస్క్ లేని పెట్టుబడి!
UIDAI: ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌తో సరికొత్త రికార్డు..! జులైలో 19 కోట్లకు పైగా లావాదేవీలు!