తక్కువ ధరలో ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అసుస్ కంపెనీ మంచి వార్తను అందించింది. భారత మార్కెట్లో రెండు కొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిలో ఒకటి వివోబుక్ ఎస్16 అనే ఏఐ ల్యాప్‌టాప్, మరొకటి క్రోమ్‌బుక్ సీఎక్స్15. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలోనూ ఆకర్షణీయమైన ఫీచర్లు, తక్కువ ధర, ఏఐ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
వివోబుక్ ఎస్16 మెటాలిక్ డిజైన్‌తో, కేవలం 1.59 సెం.మీ. మందంతో, 1.74 కిలోల తూకంతో తయారు చేయబడింది. 16 ఇంచుల ల్యూమినా ఓలెడ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ఏఐ ఫీచర్లు, లైవ్ క్యాప్షన్స్, విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్, అసుస్ ఏఐ యాప్స్, స్టోరీ క్యూబ్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి. 70 వాట్ అవర్ బ్యాటరీతో 32 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. అదనంగా అసుస్ ఐస్‌కూల్ థర్మల్ టెక్నాలజీ వలన ఎక్కువ సేపు వాడినా వేడి పెరగదు.
ఈ మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ ఇన్‌ఫ్రారెడ్ వెబ్‌కెమెరా, ప్రైవసీ షట్టర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2024 లైఫ్‌టైమ్ వాలిడిటీ, 1 సంవత్సరం 100జీబీ వన్‌డ్రైవ్ స్టోరేజ్, విండోస్ 11 హోమ్, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ లభిస్తాయి. వైఫై 6ఇ, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎంఐ, ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి.
క్రోమ్‌బుక్ సీఎక్స్15 మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో, 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. క్రోమ్ ఓఎస్ నడుస్తుంది. 13 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎంఐ, 3.5మి.మీ ఆడియో జాక్, హెచ్‌డీ వెబ్‌కెమెరా వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి.
ధర పరంగా వివోబుక్ ఎస్16 రూ.79,990 నుండి, క్రోమ్‌బుక్ సీఎక్స్15 రూ.19,990కి లభ్యమవుతున్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ లేదా అసుస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.