మద్యం కుంభకోణంలో భూమన కరుణాకర్ రెడ్డి పేరు బయటకు వస్తున్న వేళ, ఆయన కుంభకోణం దోషుల తరపున వకాల్తా చేపట్టి, నిందితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా భూమన హైదరాబాద్‌లో మకాం వేసి, తన పూర్వ పరిచయాలను ఉపయోగించి SIT, ఈడీ అధికారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అంతిమ లబ్ధిదారుగా ఛార్జిషీట్‌లో వైసీపీ అధినేత జగన్ పేరు రావడంతో, ఆయన పేరు రాకుండా చూడడం భూమన ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.
ఇప్పటికే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి సహా పలువురు జైలులో ఉండగా, వారిని బయటకు తెచ్చే మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు, తిరుపతిలో దళిత యువకుని కిడ్నాప్, దాడి ఘటనలో కూడా భూమన తండ్రీకొడుకుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. భూమన అనుచరులే దాడికి పాల్పడగా, వారిని భూమన ఇంటి వద్ద నుంచే అరెస్ట్ చేశారు. అయినప్పటికీ, తిరుపతి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా, నగరాన్ని భూమన రౌడీలకు రాసిచ్చారా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.