సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం తెరపై హీరో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా అనేక మందికి ప్రాణదాత. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆయన చేస్తున్న సేవలు అపారమైనవి. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 5,000 మంది పిల్లలకు ఉచిత హార్ట్ సర్జరీలు చేయించడం ఆయన ఉదారతకు నిదర్శనం. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఎంతోమంది చిన్నారులు మళ్లీ కొత్త జీవితం పొందారు.
మహేశ్ బాబు ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఒకసారి వెల్లడిస్తూ, "మాకు డబ్బులు ఉన్నాయి. కానీ ఆర్థిక సమస్యల వల్ల చికిత్స పొందలేని వారు ఎంత కష్టపడుతారో తెలుసు. అందుకే ఆ చిన్నారుల ప్రాణాలు కాపాడాలనే తపనతో ఈ సేవా కార్యక్రమం మొదలెట్టాను" అని చెప్పారు. ఆ మాటలు ఆయన మనసు ఎంత పెద్దదో చాటిచెప్పాయి.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కేవలం సంబరాలు చేసుకోవడమే కాకుండా, రక్తదాన శిబిరాలు, చెట్లు నాటడం, దాతృత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఒక ప్రత్యేకత. మహేశ్ ప్రేరణతో అనేక మంది అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
చిన్నారుల ‘గుండె’ చప్పుడు ఆగిపోకుండా కాపాడుతున్న మహేశ్ బాబు, తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాదు, సమాజంలోనూ ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఆయన కరుణ, సేవాభావం, వినయం – ఇవన్నీ కలిపి ఒక నిజమైన ‘రియల్ లైఫ్ హీరో’గా నిలిపాయి.