శుభవార్త.. గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner Ring Road) మూడో దశ నిర్మాణం త్వరలో మొదలు కానుంది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగిపోయిన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఊపిరి పోసింది. భూసేకరణ పూర్తి చేసి, నష్టపరిహారం చెల్లించి, నిర్మాణాలను తొలగించే పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. రూ. 48 కోట్ల ఖర్చుతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి CRDA ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో టెండర్లు పిలవనున్నారు. పల్నాడు నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు గుంటూరులోకి రాకుండానే వెళ్ళేందుకు ఈ రోడ్డు ఉపయోగపడనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక చొరవ చూపారు.
ఇది కూడా చదవండి: Jagan Tour: జగన్ పర్యటన.. సింగయ్య మృతి కేసులో కీలక మలుపు! ప్రమాద సమయంలో..
దీంతో మూడో దశ పనుల్లో కదలిక వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో 180 ఇళ్ళు తొలగించాల్సి ఉంది. బాధితులకు నష్టపరిహారంతో పాటు వేరే చోట ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు రూ. 6.35 కోట్ల నష్టపరిహారాన్ని GMC ద్వారా వెంటనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే స్వర్ణభారతి నగర్ వద్ద ఇళ్ళ తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయని అధికారులు చెప్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశలో 4.25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. ఇందులో 3.1 కిలోమీటర్ల మేర ఎలాంటి ఇబ్బందులు లేవు. మిగిలిన ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉండగా వాటిని కూడా పరిష్కరించారు.
ఇది కూడా చదవండి: AP Weather report: అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!
రూ. 48 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణానికి CRDA ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు మొదటి దశను 2010-14 మధ్య చేపట్టారు. మొదటి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా 4.7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. 2014లో రెండో దశ చేపట్టారు. ఈ దశలో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతినగర్ వరకు రూ. 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల మేరకు రోడ్డు వేశారు. ఇప్పుడు మూడో దశలో స్వర్ణభారతినగర్ నుంచి పెదపలకలూరు వరకు రోడ్డు నిర్మించనున్నారు. ఇళ్ల తొలగింపు సమస్యల వల్ల ఈ పనులు ఇంతకాలం ఆగిపోయాయి.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Road Service: ఏపీలోని ఆ రెండు రోడ్లకు మహర్దశ! 4 వరుసలుగా .. మారనున్న ఆ ప్రాంతం రూపు రేఖలు!
Hyderabad Star Hotels: వచ్చే ఆరేళ్లలో 25 స్టార్ హోటళ్లు... ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
Air India Incident: టెన్షన్.. టెన్షన్.. మరో ఘోరం.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి!
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
Cognizant: వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు!
World Bank Visits: పరుగులు పెడుతున్న అమరావతి రాజధాని పనులు.. వరల్డ్ బ్యాంక్, ADB బృందాలు!
Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..
MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?
kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!
AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: