CBN Meeting: రైతుల కష్టంపై చంద్రబాబు సమీక్ష.. ఎరువులు, ఉల్లి కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు!

టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆపిల్ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో “ఆవ్ డ్రాపింగ్” పేరుతో ఈవెంట్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఆపిల్ వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ ఉంటుంది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ ఐఫోన్ 17 సిరీస్. డిజైన్‌లో పెద్ద మార్పులతో ఈసారి ఆపిల్ ప్రపంచాన్ని ఆకట్టుకోనుందనే అంచనాలు ఉన్నాయి.

Employees: ఏపీ ఉద్యోగులకు శుభవార్త..! ఒక్కో ఖాతాలో రూ.70 వేల వరకూ డీఏ బకాయిల జమ..!

ఐఫోన్ 17 ఎయిర్: అత్యంత సన్నని ఫోన్
నాలుగు మోడళ్లు — ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో ఐఫోన్ 17 ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోనే అత్యంత సన్నని మోడల్‌గా రికార్డు సృష్టించనుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, ప్రోమోషన్ టెక్నాలజీ, కొత్త A19 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఇందులో ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు — కేవలం ఈ-సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ధర సుమారు 900 డాలర్ల నుంచి ప్రారంభం కావొచ్చు.

జీ20లో అగ్రస్థానం భారత్‌దే..! నిరుద్యోగ రేటు కేవలం 2% మాత్రమే..!

ప్రో మోడళ్లలో కెమెరా బార్, కొత్త లుక్
బేస్ మోడల్ డిస్‌ప్లేను 6.3 అంగుళాలకు పెంచి, తొలిసారిగా 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ జోడించారు. ఇక ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లకు డిజైన్‌లో భారీ మార్పులు వస్తున్నాయి. ఫోన్ వెనుక భాగంలో “కెమెరా బార్” ఉండనుంది. టైటానియం ఫ్రేమ్‌కి బదులుగా అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. శక్తివంతమైన A19 ప్రో ప్రాసెసర్, 48MP టెలిఫోటో లెన్స్, ముందు–వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డింగ్‌ వీటిలో ప్రత్యేకత. ధరలు వరుసగా 1,099 డాలర్లు, 1,199 డాలర్ల నుంచి ప్రారంభం కానున్నాయి.

Dairy Farmers: పశు రైతులకు గుడ్ న్యూస్‌..! పూచీకత్తు అవసరం లేకుండానే బ్యాంకు రుణాలు..!

కొత్త వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ ప్రో 3
ఐఫోన్‌లతో పాటు, ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని కూడా ఆవిష్కరించనుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, టెంపరేచర్ సెన్సింగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఆపిల్ వాచ్ అల్ట్రా 3, సిరీస్ 11, కొత్త SE మోడల్ కూడా విడుదల కానున్నాయి. శాటిలైట్ కనెక్టివిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో ఇవి వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. టెక్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఈవెంట్ ఆపిల్ ఉత్పత్తుల లైనప్‌లో కొత్త అధ్యాయంగా నిలుస్తుంది..

UPI transactions : ఇక నుంచి మారనున్న కొత్త రూల్స్.. ఈ నెల 15 నుంచి UPI లావాదేవీలకు!
Lokesh tweet: నేను మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థిని.. నా కుమారుడు కూడా అదే దారిలో.. లోకేశ్!
Nominated List: ఏపీలో ఆ కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం! పూర్తి వివరాలు ఇవిగోండి..
AP IAS ల పై భారీగా బదిలీల వేటు! టీటీడీ ఈఓ తో సహా! జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
Vizag Skywalk Bridge: వైజాగ్ స్కైవాక్ వంతెన అద్భుతం.. ఆనంద్ మహీంద్రా!
Chola Emperor: వెయ్యి రూపాయల ముఖ విలువ, కానీ ధర వేలు! చరిత్రను చేతిలో పట్టుకున్న కోనసీమ వాసి!