Header Banner

అమరావతి పునఃప్రారంభ సభలో ప్రత్యేక ఆకర్షణగా స్క్రాప్ మోదీ విగ్రహం! ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు..

  Fri May 02, 2025 13:03        Politics

మ‌రికాసేపట్లో ఏపీ రాజ‌ధాని అమ‌రాతి ప‌నుల పునఃప్రారంభం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అమ‌రావ‌తి ప‌నుల‌ను లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో వ్యర్థ ఇనుము (ఐరన్ స్క్రాప్)తో రూపొందించిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న  ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఈ కళాఖండాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెనాలికి చెందిన ప్రముఖ స్క్రాప్ ఆర్టిస్ట్ కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన బృందం ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు. మెకానిక్ షెడ్లలో, ఇతర ప్రాంతాలలో వృధాగా పడేసిన పాత నట్లు, బోల్టులు, ఇనుప ముక్కలు వంటి స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించి, వాటితో ఎంతో నైపుణ్యంగా ఈ శిల్పాలను రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ ప్రతిమను ఆకట్టుకునే రీతిలో తయారుచేశారు.

 

ఇది కూడా చదవండి: అయ్యయ్యో.. అప్పుడే నిండు 116 ఏళ్లు నిండిపోయాయా.. ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత!

 

వీటితో పాటు అమరావతిని సూచించే బుద్ధుడి విగ్రహం, దాని వెనుక ధర్మచక్రం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రతీకగా నిలిచే సింహం బొమ్మను కూడా స్క్రాప్‌తోనే అద్భుతంగా తీర్చిదిద్దారు. "అమరావతి పునః నిర్మాణం 2-5-2025" అనే అక్షరాలను కూడా పాత ఇనుప సామాగ్రితో కళాత్మకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల చిత్రాలను స్టెయిన్‌లెస్ స్టీల్‌లో రూపొందించి ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా కళాకారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రధానమంత్రి అమరావతి పునః నిర్మాణ పనుల కోసం వస్తున్నారని తెలిసిన వెంటనే, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఒక ప్రత్యేక కళాఖండాన్ని అమరావతిలో ప్రదర్శించాలని భావించాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాల తయారీలో మాకు మంచి గుర్తింపు ఉంది, అందుకే ఈ మాధ్యమాన్నే ఎంచుకున్నాం" అని తెలిపారు. గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి నగరాల నుంచి స్క్రాప్‌ను సేకరించినట్లు ఆయన వివరించారు. 

సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక రైతులు కూడా ఈ కళాఖండాలను చూసి ముగ్ధులయ్యారని, వీటిని శాశ్వతంగా అమరావతిలోని ఏదైనా కూడలిలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations