ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఐదో ఎన్ఐపిబీ సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.

ఇది కూడా చదవండి: ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో పాటు పలు కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదించనుంది. కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్‌కు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదించనుంది. అమరావతి రాజధాని పునః ప్రారంభ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group