మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తెలిపారు. యువగళం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజవర్గం చిన్న కాకానిలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగనుంది. దేశంలోనే అత్యున్నత ఆస్పత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నారా లోకేష్ గడువు విధించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. 1984లో 30 పడకల ఆస్పత్రి కోసం దివంగ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు.
ఇది కూడా చదవండి: మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!
యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానికులు 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా చేయాలని తనను కోరారని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్‌కు దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. హాస్పిటల్‌లో డీహైడ్రేషన్ సెంటర్‌ను కూడా ఈ కలుపుతామని చెప్పారు. మంగళగిరి పానకాల స్వామి గుడి కూడా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2019లో ఓడిపోయినప్పుడు తనను చాలామంది కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. మంగళగిరి ప్రజలు దానికి ధీటుగా తనను గెలిపించి సమాధానం ఇచ్చారని తెలిపారు. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ వన్ స్థానంలో ఉండాలనేది తన లక్ష్యం మని ఉద్ఘాటించారు. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా అందరం పనిచేయాలని సూచించారు. మంగళగిరిలో చాలామంది హైపర్ టెన్షన్ డయాబెటిక్స్‌తో బాధపడుతున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నా లక్ష్యమిదే.. మంగళగిరిని అలా మారుస్తా సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!
మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!
మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..
పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!
వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: