అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) మరో 44,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌ ద్వారా సేకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 11 గ్రామాల్లో ఈ భూముల సమీకరణను చేపట్టాలన్న ఆలోచనతో అధికారులు రైతులతో చర్చలు మొదలుపెట్టారు. ఈ భూములు ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, రైల్వే లైన్, స్పోర్ట్స్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ సిటీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వంటి కీలక మౌలిక సదుపాయాల కోసం అవసరమవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో, వీటి అవసరాల మేరకు భూములను ముందుగానే సిద్ధం చేయాలన్నదే సీఆర్‌డీఏ ధ్యేయం.

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

ఇక ఈ సమీకరణ పనులు ఉభయతారకంగా ఉండేలా ల్యాండ్ పూలింగ్ విధానాన్నే ప్రధానంగా ఉపయోగించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. భూముల విలువ పెరిగిపోవడంతో భూసేకరణ కంటే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియనే సరైన మార్గంగా అధికారులు పరిగణిస్తున్నారు. వరదనీటి కాలువలు, రిజర్వాయర్లు, మౌలిక సదుపాయాల విస్తరణల వల్ల ఇప్పటికే గతంలో సమీకరించిన భూముల్లో కొంత భాగం ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు అమరావతి అభివృద్ధికి మరిన్ని భూములు అవసరమవుతాయని సూచించడమూ ఈ నిర్ణయానికి నేపథ్యంగా ఉంది. మొత్తం మీద, అమరావతిని ఒక సమగ్ర రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో భవిష్యత్తు అవసరాలకోసం భూముల సమీకరణ కీలకంగా మారింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group