విమానంలో ప్రయాణం చేసే సమయంలో ఫ్లైట్ అటెండెంట్స్ మిమ్మల్ని స్వాగతించేటప్పుడు మీ పాదాల వైపు ఒకసారి లుక్ వేస్తారని ఎప్పుడైనా గమనించారా? ఇది కేవలం మర్యాద కోసం కాదు, డ్రెస్సింగ్ సెన్స్ చూడడానికీ కాదు. నిజానికి, ఇది వారి డ్యూటీలో భాగమైన ఒక ముఖ్యమైన సేఫ్టీ ప్రాసెస్. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రయాణికుల సేఫ్టీకి మీ షూస్ ఎలా సహాయపడతాయో అంచనా వేసేందుకు వారు అలా చేస్తారు. ఈ చిన్న లుక్కే అనుకోని ప్రమాదాల సమయంలో మీ సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.
ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ సమయంలో ప్రతి సెకను ఎంతో విలువైనది. అలాంటి సమయంలో ప్రయాణికులు స్లైడ్స్ ద్వారా బయటకు రావాల్సి వస్తుంది. ఈ సమయంలో బరువైన బూట్లు, పొడవైన హై హీల్స్, లేదా జారిపోయే శాండిల్స్ ఉంటే అవి మీ కదలికలను నెమ్మదింపజేస్తాయి. కొన్నిసార్లు పక్కన ఉన్నవారికి కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. అంతేకాదు, కొన్ని షూస్ విమానంలోని సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను పాడుచేయగలవు. అందుకే ఫ్లైట్ అటెండెంట్స్ మీ ఫుట్‌వేర్‌ను జాగ్రత్తగా గమనిస్తారు.
హై హీల్స్ ఎందుకు అనుమతించరంటే, ఎమర్జెన్సీ స్లైడ్స్ గాలితో నింపబడినవిగా ఉంటాయి. వీటిని ఉపయోగించి వందలాది మంది బయటకు రావాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో హై హీల్స్ లేదా పదునైన షూస్ వాడితే ఆ స్లైడ్స్ పంక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎయిర్‌లైన్స్ రూల్స్ ప్రకారం హై హీల్స్ వాడకూడదు. అదనంగా, సేఫ్టీతో పాటు ఇవి మీ కాలికి గాయాలు తగలకుండా కాపాడుతాయి కూడా.
కేవలం ఎమర్జెన్సీ కాకుండా, ఆరోగ్యం పరంగా కూడా ఫుట్‌వేర్ చాలా ముఖ్యం. విమానంలో క్యాబిన్ ప్రెజర్ మార్పుల వల్ల రక్తప్రసరణ సమస్యలు రావచ్చు. కాళ్లకు బిగుతుగా ఉండే షూస్ వేసుకుంటే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే వదులుగా, కంఫర్టబుల్‌గా ఉండే స్నీకర్స్ లేదా అథ్లెటిక్ షూస్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం, చాలామంది ప్రయాణికులు విమానంలో చెప్పులు తీసేయడం అలవాటు చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్లిప్‌ఫ్లాప్స్ లేదా శాండిల్స్ వేసుకున్నవారు ఇలా చేస్తారు. కానీ ఇది అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. టాయిలెట్ దగ్గర నేలపై చెప్పులు లేకుండా నడవడం మరింత ప్రమాదకరం. అందుకే ఫ్లైట్ అటెండెంట్స్ మీ షూస్‌ను గమనించి సూచనలు ఇస్తారు. చివరగా, టేకాఫ్, ల్యాండింగ్ లేదా టర్బులెన్స్ సమయంలో షూస్ తీయకుండా ఉండటం తప్పనిసరి. సరైన షూస్ వాడటం మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.