ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో మరో 30,000 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. కోర్ క్యాపిటల్ వెలుపల (బయట) ఈ భూ సేకరణ జరగనుందనీ, రాజధాని విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలకు ఇది అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 33,000–34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) ద్వారా సేకరించిన ప్రభుత్వం, ఈ అదనపు భూమి సేకరణ నిర్ణయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వేగం పెంచింది. అమరావతి చుట్టూ వాణిజ్య, నివాస, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించడం, అలాగే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం కనిపిస్తోంది. 2024లో ఇప్పటికే 1,575 ఎకరాలను అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం సేకరించిన ఏపీసీఆర్‌డీఏ, ఇప్పుడు ఈ అదనపు 30,000 ఎకరాల సేకరణతో రాజధాని చుట్టూ సమగ్ర అభివృద్ధికి పునాది వేయనుంది. ఈ నిర్ణయంతో అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంలో ఒక చదరపు గజం ధర రూ.10,000 నుంచి రూ.40,000–50,000కి చేరింది. ఈ కొత్త భూ సేకరణ ప్రకటన రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
రూ.64,000 కోట్ల అంచనాతో జరుగుతున్న అమరావతి ప్రాజెక్టులో వరల్డ్ బ్యాంక్, హడ్కో, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూరుతున్నాయి. అందువల్ల అభివృద్ధి పనులు జోరుగా సాగడం ఖాయం. ప్రభుత్వం 2028 నాటికి కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. అయితే, గతంలో భూములు ఇచ్చిన రైతుల నుంచి కొన్ని న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతామనీ.. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి అమరావతి కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2028లో జమిలి ఎన్నికలు జరగొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అవి జరగకపోతే.. 2029లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపే.. అమరావతిలో అభివృద్ధి జరిగినట్లుగా చూపించాల్సి ఉంటుంది. అలా చూపిస్తేనే, కూటమి ప్రభుత్వం వైపు ప్రజలు పాజిటివ్‌గా ఉంటారు. ఐతే.. గత 10 నెలల్లో దాదాపు 8 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. మున్ముందు పెట్టుబడులు పెరుగుతున్నాయి కాబట్టి.. ఇప్పటి నుంచి అదనపు భూ సేకరణ జరపడం ద్వారా.. భవిష్యత్తు ప్రభుత్వ అవసరాలకూ, కంపెనీలకు భూములు ఇచ్చేందుకూ.. ఈ అదనంగా సేకరించిన భూములు ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు.. అమరావతి చుట్టుపక్కల దాదాపు 70 కిలోమీటర్ల వరకూ.. భూముల ధరలు పెరిగేలా చేస్తాయనే అంచనాలున్నాయి. ఈ జోరు ఎలా ఉంటుందో.. మున్ముందు కనిపించనుంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!
మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!
ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!
మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: