కాళ్లు, చేతులు ఆడినంత వరకు సమాజం కోసం పని చేస్తానని ఉద్యోగవిరమణ చేసిన సందర్భంలో చెప్పానని, ఆ మాటకు కట్టుబడి రాజకీయాల్లోకి వస్తున్నానని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైకాపా విధ్వంసం సృష్టించిందని, రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని అన్నారు. వైకాపా నేతలకు సంఘంలో గౌరవం లేదన్నారు. "ఏపీకి పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం జగన్మోహన్రెడ్డి. రాజకీయాలు అంటే సంపాదన అని ఆయన అనుకుంటారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయాము. అక్రమాలు చేసేవారికే ఆయన పెద్దపీట వేస్తారు. ప్రజలను కులాలు, వర్గాలుగా విడదీస్తారు. జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి కోడికత్తి శ్రీను. అతడి జీవితాన్ని జగన్ చిదిమేశారు. ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించారు. సాక్ష్యం చెప్పకుండా కేసును జగన్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అభిమానులు పునరాలోచించుకోవాలి. కోడికత్తి శ్రీనుకు నా వంతు సహకారం అందిస్తా. జగన్ బాధితులకు అండగా ఉంటాను. జగన్ అక్రమాలు, అన్యాయాలు బయట పెడతాను. నేను పోరాడతాను. నా ప్రయత్నానికి అందరూ సహకరించాలి. జగన్పై కేసులు కోకొల్లలు.. వాటిపై పోరాడతాను” అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!
మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!
ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!
మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: