యూపీఐ పేమెంట్స్ లో మరోసారి అంతరాయం ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు నిలిచిపోయాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు జరగడం లేదని, నెట్‌వర్క్ స్లో అని వస్తుందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు 1,000 మందికి పైగా యూపీఐ సేవల్లో అంతరాయం గురించి ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ తెలిపింది. ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్ లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా... సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని ఎన్‌పీసీఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2న కూడా యూపీఐ సేవలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రోజుల వ్యవధిలో తాజాగా మరోసారి యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఆటంకం ఏర్పడింది. దీనిపై ఎన్‌పీసీఐ ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!
మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..
పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!
వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: