దేశంలోనే నంబర్ వన్ క్లీన్ సిటీగా నవీ ముంబై.. విజయవాడ, విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు!
India's Cleanest Cities 2025-26: దేశవ్యాప్తంగా నగరాల పరిశుభ్రతను అంచనా వేసే స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మహారాష్ట్రలోని నవీ ముంబై మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఎనిమిదేళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఈసారి ఆ రికార్డు దక్కలేదు. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రానికి చెందిన మరో నగరం గ్రేటర్ విశాఖపట్నం కూడా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ తాజా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ నగరాలు ప్రత్యేక గుర్తింపు సాధించాయి.
దేశంలోనే నంబర్ వన్ క్లీన్ సిటీగా నవీ ముంబై.. ఇండోర్‌కు షాక్.. టాప్ 3లో విజయవాడ..
దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలు ఇవే.. టాప్‌లో నవీ ముంబై, విజయవాడకు అరుదైన ఘనత..
దేశవ్యాప్తంగా నగరాల పరిశుభ్రతను అంచనా వేసే స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మహారాష్ట్రలోని నవీ ముంబై మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఎనిమిదేళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఈసారి ఆ రికార్డు దక్కలేదు. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రానికి చెందిన మరో నగరం గ్రేటర్ విశాఖపట్నం కూడా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ తాజా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ నగరాలు ప్రత్యేక గుర్తింపు సాధించాయి.
ఇండోర్‌కు మారిన కేటగిరీ.. మెంటర్ సిటీగా రెండో స్థానం
గత ఎనిమిదేళ్లుగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తూ వచ్చిన ఇండోర్ ఈసారి ప్రధాన ర్యాంకింగ్స్‌లో కాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన మెంటర్ సిటీ విభాగంలో పోటీపడింది. 'స్వచ్ఛ షెహర్ జోడీ' (Swachh Shehar Jodi) కార్యక్రమంలో భాగంగా ఇండోర్ తన భాగస్వామి పట్టణం డిపాల్‌పూర్‌తో కలిసి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ విభాగంలో అహ్మదాబాద్ తన భాగస్వామి పట్టణం సనంద్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి తన భాగస్వామి పట్టణం కుప్పంతో కలిసి మూడో స్థానాన్ని సాధించింది. అంటే పరిశుభ్రతలో ముందున్న నగరాలు ఇతర పట్టణాలకు మార్గదర్శకంగా నిలుస్తూ వాటి అభివృద్ధికి సహకరించే విధానానికి కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 4,700కు పైగా పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్నాయి. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పరిశుభ్రత సర్వే నిర్వహించారు.
ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌కు 'స్వచ్ఛతా కి నయీ పహల్ - బఢాయే హాత్, కరేన్ సఫాయీ సాథ్' అనే నినాదాన్ని ఎంపిక చేశారు. అంటే పరిశుభ్రతలో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి, అందరూ చేతులు కలిపి నగరాలను శుభ్రంగా ఉంచాలన్నది ఈ థీమ్ ప్రధాన ఉద్దేశం.
నదీ తీర పట్టణాల్లో రేవా టాప్.. తీర ప్రాంతాల్లో పూరీకి మొదటి స్థానం
వివిధ ప్రత్యేక విభాగాల్లోనూ పలు నగరాలు అవార్డులు సాధించాయి. నదీ తీర ప్రాంతాల్లో అత్యంత పరిశుభ్రమైన పట్టణంగా మధ్యప్రదేశ్‌లోని రేవా మొదటి స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మూడో స్థానంలో నిలిచాయి.
తీర ప్రాంత పట్టణాల విభాగంలో ఒడిశాలోని పూరీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేరళలోని అలప్పుజ రెండో స్థానంలో, మహారాష్ట్రలోని రత్నగిరి మూడో స్థానంలో నిలిచాయి.
హిమాలయ ప్రాంత నగరాల విభాగంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. జమ్మూ రెండో స్థానాన్ని, జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
జనాభా ఆధారంగా నగరాల ర్యాంకింగ్స్
జనాభా ప్రాతిపదికన నిర్వహించిన పోటీల్లోనూ వివిధ నగరాలు తమ ప్రతిభను చాటుకున్నాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని అగ్రస్థానాన్ని సాధించింది.
అదేవిధంగా 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని దేవాస్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ రెండో స్థానాన్ని, మధ్యప్రదేశ్‌లోని సాగర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
20 వేల నుంచి 50 వేల మధ్య జనాభా ఉన్న పట్టణాల విభాగంలో మహారాష్ట్రలోని వీటా మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాలోని ఆస్కా రెండో స్థానాన్ని, గోవాలోని పనాజీ మూడో స్థానాన్ని సాధించాయి.
మెంటర్ నగరాల సహకారంతో పరిశుభ్రతలో గణనీయమైన పురోగతి
ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మెంటర్ సిటీ విధానం మంచి ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిశుభ్రతలో ఇప్పటికే మెరుగైన ఫలితాలు సాధించిన నగరాలు ఇతర నగరాలకు మార్గనిర్దేశం చేయడం వల్ల పలు అంశాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని తెలిపింది.
2024-25తో పోలిస్తే 2025-26 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెంటీ నగరాల పనితీరు మెరుగుపడింది. నగరాల్లో కనిపించే పరిశుభ్రత (Visible Cleanliness) సూచిక గత ఏడాది 48 శాతంగా ఉండగా, ఈసారి 70 శాతానికి పెరిగింది.
ఇళ్ల నుంచి చెత్త సేకరణ (Door-to-Door Collection) విషయంలోనూ మంచి పురోగతి నమోదైంది. గత ఏడాది 52 శాతంగా ఉన్న ఈ సూచిక తాజా సర్వేలో 74 శాతానికి చేరుకుంది. చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తగా వేరు చేయడం (Source Segregation) గతంలో 16 శాతంగా ఉండగా, ఇప్పుడు 30 శాతానికి పెరిగింది.
పారిశుద్ధ్య సదుపాయాల అందుబాటు (Access to Sanitation) 11 శాతం నుంచి 38 శాతానికి చేరింది. ఉపయోగించిన నీటి నిర్వహణ (Used Water Management) 32 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు (Advocacy for Swachhata) కూడా 48 శాతం నుంచి 66 శాతానికి చేరుకున్నాయి. మెంటర్ నగరాల సహకారంతో పారిశుద్ధ్య వ్యవస్థలు బలోపేతం కావడం, ప్రజలకు అందించే సేవల నాణ్యత పెరగడం ఈ మార్పులకు కారణమని కేంద్రం పేర్కొంది.
డిజిటల్ పర్యవేక్షణతో పారదర్శకంగా సర్వే
స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి ఈసారి పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా శిక్షణ పొందిన అసెస్‌ర్లు క్షేత్రస్థాయిలో నగరాలను సందర్శించి పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రక్రియను జీపీఎస్ ఆధారిత రియల్‌టైమ్ పర్యవేక్షణతో అనుసంధానించారు.
నగరాల నుంచి ఆధారాలు సమర్పించడం మొదలుకొని వాటిని పరిశీలించి ధ్రువీకరించే వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహించారు. ప్రతి దశలోనూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను కఠినంగా అమలు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మొత్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ఫలితాలు దేశంలోని నగరాల పరిశుభ్రతలో వస్తున్న మార్పులను స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నవీ ముంబై అగ్రస్థానాన్ని సాధించడం, ఇండోర్ కొత్త మెంటర్ సిటీ విభాగంలోకి వెళ్లడం, విజయవాడ దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని దక్కించుకోవడం ఈ ఏడాది ఫలితాల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం తన జనాభా విభాగంలో అగ్రస్థానాన్ని సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు మరో గర్వకారణంగా చెప్పుకోవచ్చు.
Tags
Be the first to react