సామాన్యులకు మరో షాక్.. సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెంపు!
HUL Price Hike: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం పడింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) తన హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్‌తో పాటు మోతి గులాబ్ సబ్బు ధరలను కూడా సవరించింది. ఉత్పత్తులను బట్టి గరిష్ఠంగా 11 శాతం వరకు ధరలు పెంచగా, ఒక్కో ప్యాక్‌పై రూ.1 నుంచి రూ.10 వరకు అదనపు భారం పడనుంది. ముడిసరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సర్ఫ్ ఎక్సెల్ నుంచి వీల్ వరకు.. పెరిగిన డిటర్జెంట్ ధరలు, కొత్త రేట్లు ఇవే..
మరోసారి పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ ధరలు.. హిందుస్థాన్ యూనిలీవర్ కీలక నిర్ణయం..
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం పడింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) తన హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్‌తో పాటు మోతి గులాబ్ సబ్బు ధరలను కూడా సవరించింది. ఉత్పత్తులను బట్టి గరిష్ఠంగా 11 శాతం వరకు ధరలు పెంచగా, ఒక్కో ప్యాక్‌పై రూ.1 నుంచి రూ.10 వరకు అదనపు భారం పడనుంది. ముడిసరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నిత్యం ఉపయోగించే డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలు పెరగడం గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది. బట్టలు ఉతకడానికి ఎక్కువగా ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, ఈజీ వాష్ ప్యాకెట్ల ధరలను కంపెనీ పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధర గతంలో రూ.235 ఉండగా, ఇప్పుడు రూ.10 పెరిగి రూ.245కు చేరింది. 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.123 నుంచి రూ.128కు పెరిగింది. అంటే ఈ ప్యాకెట్‌పై రూ.5 అదనపు భారం పడనుంది.
అలాగే సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఒక కిలో ప్యాకెట్ ధరను రూ.167 నుంచి రూ.172కు పెంచారు. 500 గ్రాముల ప్యాకెట్ ధర కూడా రూ.85 నుంచి రూ.87కు చేరింది. సర్ఫ్ ఎక్సెల్ బార్ సబ్బు 250 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.3 పెంచి రూ.45గా నిర్ణయించారు. నాలుగు సబ్బులతో కూడిన బండిల్ ధరను రూ.145 నుంచి రూ.155కు పెంచారు. ఒక్కో సబ్బు బరువు 200 గ్రాములుగా ఉంటుంది. ఈ బండిల్‌పై ఏకంగా రూ.10 పెరుగుదల నమోదైంది.
సర్ఫ్ ఎక్సెల్‌తో పాటు రిన్ ఉత్పత్తుల ధరలను కూడా హిందుస్థాన్ యూనిలీవర్ సవరించింది. రిన్ ఆల 500 మిల్లీలీటర్ల ప్యాక్ ధరను రూ.90 నుంచి రూ.95కు పెంచింది. రిన్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాకెట్ ధర రూ.120 నుంచి రూ.123కు చేరింది. 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.61 నుంచి రూ.63కు పెరిగింది. దీంతో రిన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులపైనా అదనపు భారం పడనుంది.
మరోవైపు తక్కువ ధరల్లో లభించే డిటర్జెంట్ బ్రాండ్ వీల్ ధరలను కూడా కంపెనీ పెంచింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ ఒక కిలో ప్యాకెట్ ధర గతంలో రూ.90 ఉండగా, ఇప్పుడు రూ.3 పెరిగి రూ.93కు చేరింది. 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.46 నుంచి రూ.47కు పెరిగింది. తక్కువ ధరల్లో లభించే ఉత్పత్తులను కొనుగోలు చేసే కుటుంబాలపై కూడా ఈ ధరల మార్పు ప్రభావం చూపనుంది.
ఇక హోమ్ కేర్ ఉత్పత్తులతో పాటు వ్యక్తిగత సంరక్షణ విభాగంలోనూ కంపెనీ ధరలను పెంచింది. మోతి గులాబ్ సబ్బు 150 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.74 నుంచి రూ.82కు సవరించింది. అంటే ఒక్కో సబ్బుపై రూ.8 పెరిగింది. ఇది 10 శాతానికి పైగా పెరుగుదల కావడం గమనార్హం.
గత నెలలో హిందుస్థాన్ యూనిలీవర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రియా నాయర్ కూడా ధరల పెంపుపై తమ సంస్థ వైఖరిని వెల్లడించారు. ముడిసరుకుల ధరల్లో వచ్చే మార్పులను బట్టి అవసరమైన మేరకు దశలవారీగా ధరలను సవరిస్తామని తెలిపారు. ప్రస్తుతం కమోడిటీ ధరల పెరుగుదల కంపెనీలకు సవాలుగా మారినప్పటికీ, మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ మాత్రం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తుల ధరలను ఒకేసారి భారీగా పెంచకుండా, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.
ప్రస్తుతం దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలోని పలు సంస్థలు ముడిసరుకులు, ప్యాకేజింగ్, రవాణా, తయారీ వ్యయాల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. ఈ వ్యయాలను భర్తీ చేసుకోవడంతో పాటు లాభాలను కాపాడుకునేందుకు వివిధ ఉత్పత్తుల ధరలను సవరిస్తున్నాయి. అయితే ధరలు పెంచితే వినియోగదారుల కొనుగోళ్లు తగ్గే ప్రమాదం ఉండటంతో, మరోవైపు అమ్మకాల పరిమాణాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కంపెనీలకు ఎదురవుతోంది.
మొత్తంగా హిందుస్థాన్ యూనిలీవర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తులు మరింత ఖరీదయ్యాయి. ఇప్పటికే ఆహార పదార్థాలు, వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ పెరుగుదల మరో అదనపు భారంగా మారనుంది. ఇకపై నెలవారీ సరుకుల బడ్జెట్‌ను సిద్ధం చేసుకునే సమయంలో డిటర్జెంట్లు, సబ్బుల కోసం కూడా వినియోగదారులు మరికొంత మొత్తం కేటాయించాల్సి ఉంటుంది.
Tags
Be the first to react