నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఒత్తిడి, మరియు మారుతున్న వాతావరణం వల్ల మన చర్మం తన సహజమైన కాంతిని కోల్పోతుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంది. దీని కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కానీ, మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఐదు రకాల ఫేస్ ప్యాక్స్ మరియు వాటి ప్రయోజనాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం…
తేనె ఫేస్ ప్యాక్:
తేనె మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా తెనే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు తేనెను ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు ఒక టీస్పూన్ తేనెలో, కొన్ని చుక్కల నిమ్మరసం, తగినంత రోజ్ వాటర్ వేసి బాగా కలపండి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకునే ముందు మీరు ముఖాన్ని కొద్దిగా తేమగా ఉంచుకునేందులు నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేయడం. ఆ తర్వాత నీటితో శుభ్రంగా మొహాన్ని కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం సహజంగా మెరుస్తుంది.
కాఫీ ఫేస్ ప్యాక్:
మీ చర్మ కాంతిని పెంచడానికి మీరు కాఫీ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి, మీకు గ్రౌండ్ కాఫీ, తేనె, పాలు అవసరం. మీరు రెండు టీస్పూన్ల కాఫీ, ఒక టీస్పూన్ తేనె, తగినంత పాలు ఉపయోగించి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
ఈ ప్యాక్ రెడీ అయ్యాక దాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం మెరవడంతో పాటు వృద్యాప్యాన్ని తగ్గిస్తుంది.
బియ్యం పిండి ఫేస్ ప్యాక్:
బియ్యం పిండిలో చర్మానికి మేలు చేసే శోథ నిరోధక (Anti-inflammatory) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉండే అధిక నూనెను తొలగిస్తుంది. ఒక చెంచా బియ్యం పిండిలో సమాన పరిమాణంలో తేనె కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోండి.
ఎలా పనిచేస్తుంది? 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం బిగుతుగా మారి, ఆరోగ్యకరంగా కనిపిస్తుంది. ఎండ వల్ల వచ్చే ట్యాన్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
శెనగ పిండి ఫేస్ ప్యాక్:
శీతాకాలంలో మీ ముఖం మెరిసిపోవాలంటే శనగపిండి పేస్ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేసుకునేందుకు.. ముందుగా 2 టీస్పూన్ల శనగపిండిలో 1 టీస్పూన్ మిల్క్ క్రీమ్, చిటికెడు పసుపు, పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి.
ప్రయోజనం ఏమిటి.?
ఈ ప్యాక్ ముఖంపై మచ్చలను తగ్గించడమే కాకుండా, చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం పట్టులా మెరుస్తుంది.
అలోవెరా ఫేస్ ప్యాక్:
అలోవెరా (కలబంద) చర్మానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఇందులో ఉండే సహజ పోషకాలు చర్మాన్ని చల్లబరిచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. తాజా కలబంద జెల్ లో కొద్దిగా గంధపు పొడిని కలిపి ముఖానికి అప్లై చేయండి.
ప్రయోజనం ఏమిటి.?
15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా, మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలను మాయం చేయడంలో సహాయపడుతుంది. సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది చాలా మంచిది.
ముఖ్య గమనిక
పైన పేర్కొన్న చిట్కాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. ఒక్కొక్కరి చర్మం ఒక్కో విధంగా స్పందిస్తుంది. కాబట్టి:
- ఏదైనా ప్యాక్ వాడే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేసి చూడండి.
- మీకు తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
- ఏదైనా ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మంపై మంటగా అనిపిస్తే వెంటనే కడిగేయండి.
బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసేకంటే, మన ఇంట్లో ఉన్న ఈ సహజమైన పదార్థాలతో చర్మాన్ని సంరక్షించుకోవడం ఎంతో ఉత్తమం. క్రమం తప్పకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్స్ ఉపయోగిస్తే మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. మీ చర్మం మీ సంపద, దాన్ని కాపాడుకోండి!