సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం (APCO Latest News) శుభవార్త తెలిపింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేతన్నలకు ఊరట కలిగించేలా ఆప్కో బకాయిల విడుదల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సోమవారం, జనవరి 12న, చేనేత సహకార సంఘాల (Handloom Industry) ఖాతాల్లోకి రూ.5 కోట్లను జమ చేసింది. ఈ నిర్ణయం పండుగ సమయానికి (Sankranti Good News) రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అధికారికంగా వెల్లడించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని, దశలవారీగా ఆప్కో బకాయిలన్నింటినీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. గత నెలలో కూడా (Handloom Weaver Support) చేనేత సహకార సంఘాలకు సంబంధించి బకాయిలు విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. డిసెంబర్ 2025లో ఇప్పటికే రూ.2.42 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా, ఇప్పుడు అదనంగా రూ.5 కోట్లు జమ కావడంతో మొత్తం సహాయం మరింత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్‌లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ అనేది రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే కీలక సహకార సంస్థ. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థను 1976లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి, వాటిని ఆప్కో షోరూమ్‌లు, ప్రదర్శనలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తుంది. అయితే గత కొంతకాలంగా వస్త్రాలు సరఫరా చేసినప్పటికీ చేనేత సంఘాలకు సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో నేతన్నలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆప్కో బకాయిల చెల్లింపును ప్రారంభించింది. సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో కూడా కొంత మొత్తం చేనేత సొసైటీల ఖాతాల్లో జమ చేయగా, ఇప్పుడు సంక్రాంతి ముందు భారీ మొత్తాన్ని విడుదల చేయడం విశేషంగా మారింది. ఈ డబ్బులతో ముడి సరుకు కొనుగోలు, కుటుంబ ఖర్చులు, పండుగ ఏర్పాట్లు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని చేనేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, (AP Textile Department) చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకం ఇప్పటికే అమల్లో ఉంది. అదే విధంగా పవర్ లూమ్స్ నిర్వహించే వారికి నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. దీనితో పాటు థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కూడా ప్రభుత్వం అందిస్తోంది.
చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెంచే దిశగా కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను నిర్వహిస్తూ, (APCO Dues Release) ఆప్కో ద్వారా పట్టుచీరలు, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులను ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిర్ణయం తీసుకోవడం నేతన్నలకు మరింత అండగా నిలిచింది.