Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Summer Tips: ఏసీ, కూలర్ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి! Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Summer Tips: ఏసీ, కూలర్ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి! Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

Home Garden Tips: మార్కెట్లో పుదీనా కొనక్కర్లేదు.. మీ ఇంట్లోనే గుబురుగా పెంచే సీక్రెట్ చిట్కాలు మీకోసం.!!

పుదీనా మొక్క సరిగ్గా పెరగడం లేదా? ఆకులు ఎండిపోతున్నాయా? కేవలం నీటిలో లేదా చిన్న కుండీలో పుదీనాను గుబురుగా పెంచే చిట్కాలు మీ కోసమే.

Published : 2026-02-04 19:24:00

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన, రసాయనాలు లేని ఆకుకూరలు దొరకడం గగనమైపోతోంది. ముఖ్యంగా వంటల్లో సువాసన కోసం, ఆరోగ్యానికి ఔషధంగా వాడే పుదీనాను మార్కెట్లో కొనక్కర్లేకుండా మన ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. కేవలం ఒక చిన్న కుండీ లేదా ఖాళీ ప్లాస్టిక్ డబ్బా ఉంటే చాలు, మీ ఇంటిని పుదీనా పరిమళాలతో నింపేయవచ్చు.

పుదీనా పెంచడానికి ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. మార్కెట్ నుండి తెచ్చిన పుదీనా కట్టలలోని గట్టి కాడలను ఎంపిక చేసుకోవాలి. ఆ కాడలకు ఉన్న ఆకులను తీసేసి, కేవలం పైభాగంలో రెండు ఆకులు ఉంచి, వాటిని నీటిలో లేదా నేరుగా మట్టిలో నాటడం ద్వారా కొత్త మొక్కలను పెంచవచ్చు.

ఇంట్లో పెంచేటప్పుడు మట్టి మిశ్రమం నాణ్యంగా ఉండాలి.50%  మట్టి, 30% పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 20% ఇసుక కలిపిన మిశ్రమం పుదీనాకు ఎంతో అనుకూలం. పుదీనా వేర్లు లోతుగా కంటే వెడల్పుగా వ్యాపిస్తాయి. కాబట్టి లోతు తక్కువగా ఉండి, వెడల్పు ఎక్కువగా ఉన్న కుండీలను ఎంచుకోవడం ఉత్తమం.

సంరక్షణ మరియు నీటి యాజమాన్యం పుదీనాకు తేమ చాలా అవసరం. కానీ నీరు నిల్వ ఉండకూడదు. కుండీకి అడుగున రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. పుదీనాకు రోజుకు కనీసం 3 నుండి 4 గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. మరీ తీవ్రమైన ఎండ ఉంటే నీడలోకి మార్చుకోవడం మంచిది.

మొక్క పెరుగుతున్న కొద్దీ పైభాగంలో కొమ్మలను కట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మొక్క గుబురుగా తయారై ఎక్కువ  ఇస్తుంది. రోజూ మార్కెట్లో పుదీనా కట్టలు కొనాల్సిన అవసరం ఉండదు. నెలకు సుమారు 200  రూపాయల వరకు ఆదా చేయవచ్చు. బయట మార్కెట్లో దొరికే పుదీనా మురుగు నీటితో సాగు చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెంచుకోవడం వల్ల విషపూరిత కెమికల్స్ లేని స్వచ్ఛమైన పుదీనా మనకు అందుతుంది.

అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలకు పుదీనా టీ లేదా రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే ఉండటం వల్ల తాజా ఆకులను ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో మనసుకి హాయినిచ్చే పని ఏదైనా ఉందంటే అది ఇంటి తోట పెంపకమే. పుదీనా వంటి చిన్న మొక్కలతో మీ గార్డెనింగ్‌ను మొదలుపెట్టండి. ఇది మీ వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, ఇంట్లోని వాతావరణాన్ని కూడా ఆహ్లాదకరంగా మారుస్తుంది.

Spotlight

Read More →