US Iran War: ఇరాన్ క్షిపణి దాడుల ధాటికి అమెరికా బేస్‌లు ధ్వంసం..! వందలాది మంది సైనికులు మృతి? Donald Trump: చమురు ధరలు పెరిగితే అమెరికాకే లాభం..! ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ షాక్.. ఇరాక్‌లో కూలిన నాలుగో యుద్ధ విమానం! Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! UAE: అంతర్జాతీయంగా హై అలర్ట్... యూఏఈ తీరంలో కంటైనర్ నౌకపై దాడి! Tech War: ఐటీ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ప్లాన్..! పశ్చిమాసియాలో టెక్ వార్! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Israel Vs Iran: మ్యాప్‌లో లేకుండా పోతున్న ఇరాన్ నగరాలు? 10,000 ప్రాంతాలు నేలమట్టం! Sleeper Cell Alert: నిద్రాణ ముఠాల వేటలో అమెరికా..! ఖమేనీ మరణం తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతలు! US Iran War: ఇరాన్ క్షిపణి దాడుల ధాటికి అమెరికా బేస్‌లు ధ్వంసం..! వందలాది మంది సైనికులు మృతి? Donald Trump: చమురు ధరలు పెరిగితే అమెరికాకే లాభం..! ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ షాక్.. ఇరాక్‌లో కూలిన నాలుగో యుద్ధ విమానం! Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! UAE: అంతర్జాతీయంగా హై అలర్ట్... యూఏఈ తీరంలో కంటైనర్ నౌకపై దాడి! Tech War: ఐటీ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ప్లాన్..! పశ్చిమాసియాలో టెక్ వార్! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Israel Vs Iran: మ్యాప్‌లో లేకుండా పోతున్న ఇరాన్ నగరాలు? 10,000 ప్రాంతాలు నేలమట్టం! Sleeper Cell Alert: నిద్రాణ ముఠాల వేటలో అమెరికా..! ఖమేనీ మరణం తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతలు!

Narendra Modi: గల్ఫ్ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ!

Narendra Modi: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజుతో ఫోన్‌లో సంభాషించారు. గల్ఫ్‌లో కొనసాగుతున్నసంఘర్షణ, ఈ ప్రాంతాల్లోని భారతీయుల భద్రతపై వారితో చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Published : 2026-03-03 22:00:00
  • చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న విదేశాంగ శాఖ..
     
  • భారతీయుల భద్రతపై వారితో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడి..

Narendra Modi: పశ్చిమాసియాలో (Middle East) యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల క్షేమం కోసం భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా గల్ఫ్ దేశాల నేతలతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో పరిస్థితి విషమిస్తుండటంతో, మన దేశానికి అత్యంత సన్నిహిత మిత్రదేశాలైన ఒమన్ మరియు కువైట్ నేతలతో ప్రధాని మోదీ మాట్లాడారు.

కువైట్ యువరాజుతో చర్చలు: కువైట్ యువరాజు సబా అల్ ఖలీద్ అల్ సబాతో మాట్లాడిన ప్రధాని, గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయుల భద్రత: ఈ చర్చల్లో ప్రధానాంశం అక్కడున్న మన భారతీయుల రక్షణే. సుమారు కోటి మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చూడాలని ప్రధాని కోరారు. యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదని, కేవలం విధ్వంసం మాత్రమే మిగులుతుందని భారత్ మొదటి నుంచి చెబుతోంది.

దౌత్య మార్గాలు: సమస్య ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తుపాకీ గుండ్ల కంటే మాటల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ పునరుద్ఘాటించింది.
సంయమనం పాటించాలి: ఇరుపక్షాలు (ఇరాన్ మరియు ఇజ్రాయెల్-అమెరికా) పంతాలకు పోకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్ కోరింది.

యుద్ధం ముదిరితే సాధారణ పౌరులు, ముఖ్యంగా విదేశీ కార్మికులు బలి కావాల్సి వస్తుంది. అందుకే..
హెల్ప్‌లైన్ నంబర్లు: గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికే 24/7 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి.
ముందస్తు ఏర్పాట్లు: ఒకవేళ పరిస్థితి మరింత దారుణంగా మారితే, గల్ఫ్ నుంచి భారతీయులను తరలించేందుకు (Evacuation) అవసరమైన ప్రణాళికలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మన దేశ నాయకత్వం తన పౌరుల భద్రత పట్ల ఎంత బాధ్యతగా ఉందో ప్రధాని మోదీ చేసిన ఈ ఫోన్ కాల్స్ నిరూపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి వైపు అడుగులు వేయాలని, యుద్ధ జ్వాలలు ఆరిపోయి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం.

Spotlight

Read More →