Global Migration: వదిలి వెళ్తున్న ప్రజలు.. అందమైన దేశంలో ఆందోళనకర పరిస్థితులు! ఎందుకిలా.... Heart Attacks: చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ కారణాలు! మీరు కూడా ఇదే చేస్తున్నారా? Wedding Dates: మోగనున్న పెళ్లి బాజాలు..! లక్కీ ముహూర్తాల లిస్ట్ ఇదే...! No Airport: విమానాశ్రయం లేదు... సొంత కరెన్సీ లేదు..! కానీ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం! Natural medicine: పూర్వీకులు వాడిన ప్రకృతి వైద్య రహస్యాలు... ఈ ఐదు దివ్య ఫలాలు! Refrigerator: ఫ్రిజ్ నుండి వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..! Gas Cylinder: నెలకు వచ్చే సిలిండర్ ఇకపై 40 రోజులు రావాలంటే ఇలా చేయండి! No Cars City: ప్రపంచంలో కార్లు లేని ఏకైక నగరం... మీకు తెలుసా? Parenting Tips: ఆరోగ్యకరమైన స్నాక్స్ వర్సెస్ జంక్ ఫుడ్... తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు! Chinese use chopsticks: చైనీయులు ఆ కర్రలతోనే ఎందుకు తింటారు? చాప్‌స్టిక్స్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలివే! Global Migration: వదిలి వెళ్తున్న ప్రజలు.. అందమైన దేశంలో ఆందోళనకర పరిస్థితులు! ఎందుకిలా.... Heart Attacks: చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ కారణాలు! మీరు కూడా ఇదే చేస్తున్నారా? Wedding Dates: మోగనున్న పెళ్లి బాజాలు..! లక్కీ ముహూర్తాల లిస్ట్ ఇదే...! No Airport: విమానాశ్రయం లేదు... సొంత కరెన్సీ లేదు..! కానీ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం! Natural medicine: పూర్వీకులు వాడిన ప్రకృతి వైద్య రహస్యాలు... ఈ ఐదు దివ్య ఫలాలు! Refrigerator: ఫ్రిజ్ నుండి వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు..! Gas Cylinder: నెలకు వచ్చే సిలిండర్ ఇకపై 40 రోజులు రావాలంటే ఇలా చేయండి! No Cars City: ప్రపంచంలో కార్లు లేని ఏకైక నగరం... మీకు తెలుసా? Parenting Tips: ఆరోగ్యకరమైన స్నాక్స్ వర్సెస్ జంక్ ఫుడ్... తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు! Chinese use chopsticks: చైనీయులు ఆ కర్రలతోనే ఎందుకు తింటారు? చాప్‌స్టిక్స్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలివే!

Chinese use chopsticks: చైనీయులు ఆ కర్రలతోనే ఎందుకు తింటారు? చాప్‌స్టిక్స్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలివే!

చైనీస్ ఆహార పద్ధతుల వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను చాప్‌స్టిక్స్ వాడకం మరియు పింగాణి పాత్రల ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

Published : 2026-02-09 15:53:00

రుచి మరియు వేడిని కాపాడే సంప్రదాయం.

భోజనంలో గౌరవానికి చిహ్నం.

చిన్న ముక్కలను పట్టుకునేందుకు సులభమైన సాధనం.

ఒక్కొక్క దేశం ఒక్కొక్క సాంప్రదాయాన్ని అలమరుచుకొని ఉంటుంది.  అంతెందుకండోయ్ తినే ఆహారంలో కూడా విభినమైన శైలిలో ఉన్నాయి‌‌. చైనీస్ భోజనం పద్ధతి చూస్తే చాలామందికి ఒక డౌట్ వస్తుంది.  ఏంటబ్బా వీరు ఎప్పుడు  సన్నని కర్రలతోనే తింటారా అని సందేహం మనకు కూడా  కలుగుతూ ఉంటుంది. దాని  వెనుకున్న రహస్యాలను తెలుసుకుందామా మరి.

చైనీస్ భోజన పద్ధతి చూస్తే చాలామందికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ముందుగా కనిపించే విషయం పింగాణి బౌల్స్, చిన్న కప్పులు, చేతుల్లో రెండు సన్నని కర్రలు. ఇవన్నీ చూసి ఇలా ఎందుకు తింటారు? అనే ప్రశ్న సహజంగా వస్తుంది. చైనీస్ వాళ్లు చేతులతో గానీ, ఫోర్క్–స్పూన్‌లతో గానీ కాకుండా చాప్‌స్టిక్స్‌తో తినడం కేవలం అలవాటు కాదు దాని వెనుక శతాబ్దాలుగా ఏర్పడిన జీవనశైలి, సంస్కృతి, ఆహార తత్వం దాగి ఉంది.

చైనీస్ వంటకాల్లో కూరగాయలు, మాంసం, నూడుల్స్ అన్నీ ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండుతారు. అలా వండిన ఆహారాన్ని మళ్లీ ప్లేట్‌లో కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే కత్తి లేదా ఫోర్క్ అవసరం లేకుండా, చిన్న ముక్కలను సులభంగా పట్టుకునే చాప్‌స్టిక్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇది తినడాన్ని వేగంగా, సౌకర్యంగా మార్చింది.

భోజనంలో పోర్సలిన్ లేదా పింగాణి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి వేడిని ఎక్కువసేపు నిలుపుకుంటాయి. సూప్‌లు, నూడుల్స్ లాంటి ఆహారం చివరి ముక్క వరకూ వేడిగానే ఉంటుంది. అంతేకాదు, పింగాణి పాత్రలు వాసన లేదా రుచిని పట్టిపెట్టవు. ఒకే బౌల్‌లో వేర్వేరు వంటకాలు తిన్నా రుచి మారదు. అందుకే ఈ పాత్రలు చైనీస్ డైనింగ్‌లో ప్రధానంగా మారాయి.

వారి సంప్రదాయంలో ఒక్కొక్కరికి వేర్వేరు ప్లేట్లు కాకుండా, మధ్యలో పెద్ద డిష్‌లు పెట్టి అందరూ షేర్ చేసుకుని తినడం సాధారణం. అలాంటి సందర్భాల్లో చేతులతో తినడం అనారోగ్యకరం, అసభ్యంగా భావిస్తారు. చాప్‌స్టిక్స్ వాడటం వల్ల పరిశుభ్రత కాపాడబడుతుంది, ఇతరుల పట్ల గౌరవం చూపించినట్టు భావిస్తారు. 

భారతదేశంలో చేతులతో తినడం ఎంత సహజమో, చైనాలో చాప్‌స్టిక్స్‌తో తినడం అంతే సహజం. ఇది తెలివితేటల విషయం కాదు, అలవాట్ల విషయం. ప్రతి దేశం తన ఆహారానికి, జీవనశైలికి అనుగుణంగా పద్ధతులు రూపొందించుకుంది. చైనీస్ డైనింగ్ విధానం కూడా అలాంటి ఒక సాంస్కృతిక పరిణామమే. అందుకే అది విచిత్రంగా కాకుండా అర్థవంతంగా చూడాల్సిన విషయం.

Spotlight

Read More →