Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!! Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!! Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం!

RCB Fans GoodNews: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఐదు హోమ్ మ్యాచ్‌లు అక్కడే.!

RCB Fans GoodNews: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త.

Published : 2026-03-03 22:25:00
  • చిన్నస్వామిలో 5.. రాయ్‌పూర్‌లో 2: ఆర్‌సీబీ హోమ్ మ్యాచ్‌ల వేదికలపై స్పష్టత..
     
  • కర్ణాటక సర్కార్ పచ్చజెండా: చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణపై ఉత్కంఠకు తెర..

RCB Fans GoodNews: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లకు వేదికైన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తిరిగి అడుగుపెట్టనుంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఆర్సీబీ తన ఐదు హోమ్ మ్యాచ్‌లను సొంతగడ్డపైనే ఆడనుంది.

గత ఏడాది ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్ల జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణ చేపట్టిన అధికారులు స్టేడియంలో కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దీంతో ఆర్సీబీ మరో వేదికను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం భద్రతా చర్యలు మెరుగుపరచడం, ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే, ఆర్సీబీ ఆడాల్సిన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం ముందస్తు ఒప్పందం ప్రకారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

ఈ విషయమై ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. "చిన్నస్వామి స్టేడియం కేవలం మా హోమ్ గ్రౌండ్ మాత్రమే కాదు, మా జట్టు అస్తిత్వం. ఇక్కడి అభిమానుల కేరింతలు ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మా అభిమానులు సొంతగడ్డపై మ్యాచ్‌లు చూసేందుకు అర్హులు" అని ఆయన పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Spotlight

Read More →