Telangana: తెలంగాణలో రా ఎగ్ మయోనైజ్పై తనిఖీలు.. ఐదు ఆహార సంస్థల్లో ఉల్లంఘనలు గుర్తింపు!

Telangana: తెలంగాణలో ముడి గుడ్లతో తయారు చేసే మయోనైజ్ తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఆహార భద్రతా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో ఐదు ఆహార సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.

Telangana
Telangana

ఆహార భద్రతా శాఖ ప్రత్యేక తనిఖీలు.. 10 కిలోల నిషేధిత మయోనైజ్ స్వాధీనం..

రా ఎగ్ మయోనైజ్ నిషేధాన్ని ఉల్లంఘించిన ఐదు సంస్థలపై చర్యలు..

తెలంగాణలో ముడి గుడ్లతో తయారు చేసే మయోనైజ్ (Raw Egg Mayonnaise) తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఆహార భద్రతా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో ఐదు ఆహార సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.

ఆహార భద్రతా శాఖ అధికారులు రాష్ట్రంలోని 131 ఆహార సంస్థలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల సమయంలో కొన్ని సంస్థలు ముడి గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ను ఉపయోగించడం లేదా నిల్వ ఉంచడం గుర్తించారు.

నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల నుంచి మొత్తం 10 కిలోల రా ఎగ్ మయోనైజ్ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం విచారణ (అడ్జుడికేషన్) ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

ముడి గుడ్లతో తయారు చేసే మయోనైజ్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2)(a) కింద ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2025 అక్టోబర్ 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రా ఎగ్ మయోనైజ్ తయారీ, నిల్వ, విక్రయాలను నిషేధించారు. ఈ నిషేధం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.

ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలను కొనసాగిస్తామని ఆహార భద్రతా శాఖ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఆహార సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Be the first to react

Latest