రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది.. 2025–26లో రూ.1,503.90 కోట్లకు!

మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన అద్భుతంగా సక్సెస్ కావడం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలకు తెరలేపారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

success of lokesh visit to south korea has put an end false propaganda kodali party
success of lokesh visit to south korea has put an end false propaganda kodali party
  • లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన విజయవంతంతో గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలకు తెరలేపింది..

  • తాడేపల్లిలో ‘అబద్ధాల యూనివర్సిటీ’ నడుస్తోంది..

మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన అద్భుతంగా సక్సెస్ కావడం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలకు తెరలేపారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాడేపల్లి ప్యాలెస్ వేదికగా సాగుతున్న ‘జగనన్న అబద్ధాల యూనివర్సిటీ’లో పదవుల కోసం, జగన్ దగ్గర మార్కులు కొట్టేందుకే విజయవాడకు చెందిన వైసీపీ ‘హాఫ్ టికెట్లు’ వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం లోకేష్ రాత్రింబగళ్లు కష్టపడుతుంటే, ఆ పెట్టుబడుల నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికే ఆలయాల ఆదాయం తగ్గిందంటూ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నాయని డూండి రాకేష్ స్పష్టం చేశారు. ఎస్ఐబీపీ (SIBP) మీటింగుల ద్వారా కేవలం కొన్ని నెలల్లోనే 339 ప్రాజెక్టులు, రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు సుమారు 11 లక్షల ఉద్యోగాలకు ఈ రాష్ట్రం గేట్వేగా నిలిచిందని గుర్తుచేశారు. ఐఫోన్, ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి దిగ్గజాలు ఇప్పటికే వచ్చాయని, ఇప్పుడు కొరియా పర్యటనలో ఎల్జీ, శామ్సంగ్, హ్యుందాయ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో లోకేష్ జరుపుతున్న చర్చలు చూసి వైసీపీ ముఠా వణికిపోతోందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల గొడ్డలి పార్టీ దుర్మార్గపు పాలనలో ప్రజలకు రోడ్లు, నీళ్లు ఇవ్వకుండా గ్రీవెన్స్ సెల్ను కూడా ఎత్తేసి తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిన చరిత్ర జగన్ రెడ్డిదని నిప్పులు చెరిగారు.

దేవాలయాల ఆదాయం తగ్గిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో అణాపైసా కూడా నిజం లేదని పక్కా లెక్కలతో రాకేష్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల ఆదాయం 2023–24లో రూ. 1,379.19 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వ సమర్థ పరిపాలన వల్ల 2025–26 నాటికి అది రూ. 1,503.90 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. వెల్లంపల్లి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ దుర్గగుడి స్థూల ఆదాయం 2023–24లో రూ. 207.16 కోట్ల నుంచి 2025–26లో రూ. 219 కోట్లకు పెరిగిందని, అందులో హుండీ ఆదాయమే రూ. 66.58 కోట్ల నుంచి రూ. 77.50 కోట్లకు పెరగడం కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. ప్రతి ఆలయంలో ఆన్లైన్ టికెటింగ్ ప్రవేశపెట్టి, సీసీ కెమెరాల నిఘాలో పెద్ద అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపులు జరుపుతుంటే అవినీతి ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వందలాది ఆలయాలపై దాడులు జరిగాయని, దుర్గగుడిలో మూడు వెండి సింహాలు మాయమైతే ఇప్పటికీ పత్తా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథాలు తగలబడినా, హనుమంతుడి చెయ్యి విరిగితే ‘పది లక్షలు పోతే పోయింది మేం పెడతాం’ అని హిందూ ధర్మాన్ని హేళన చేసిన అహంకార పార్టీ వైసీపీ అని దుయ్యబట్టారు. నాడు దుర్గగుడి పరకామణి విభాగంలో ‘దొంగ రవి’ హుండీ సొమ్ము దోచుకుంటే ఆ నిందితుడిని కాపాడటానికి వైసీపీ పెద్ద దొంగలంతా తాపత్రయపడిన బాగోతాన్ని భక్తులు ఇంకా మర్చిపోలేదన్నారు. సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లను అసభ్యంగా దూషించే ‘రావణ్’ లాంటి వ్యక్తికీ అండగా నిలబడింది వైసీపీ పార్టీ కాదా అని నిలదీశారు.

కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి, భక్తుల మనోభావాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ఆలయాల్లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా తక్షణమే సిబ్బందిపై సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు పెడుతున్నామని రాకేష్ స్పష్టం చేశారు. హిందూ దేవాలయాల పేర్లు కూడా సరిగ్గా పలకలేని జగన్ రెడ్డి తీర్థమిస్తే చేతులు కడుక్కునే రకం, పంచ కట్టమంటే చుట్టూ తిప్పుకునే రకమని విమర్శించారు. అలాంటి నాయకుడిని పెట్టుకుని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అనే హాఫ్ టికెట్లు చొక్కాలు చింపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉన్న వెల్లంపల్లి తీరుపై జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సొంత కులానికి కూడా న్యాయం చేయలేని వెల్లంపల్లి శ్రీనివాస్.. ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాడు దేవాదాయ మంత్రిగా వెల్లంపల్లి చేయలేని పనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైల్ కదిలించి అధికారిక ఉత్సవంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా పేరు మార్చింది కూడా కూటమి ప్రభుత్వమేనని, దానికి వ్యతిరేకంగా సంతకాలు చేయించిన దౌర్భాగ్య చరిత్ర వైసీపీ నేతలదన్నారు. రాజకీయాల కోసం దేవాలయాలను వాడుకుంటూ హిందూ సనాతన ధర్మంపై బురదజల్లితే కూటమి ప్రభుత్వం కఠినంగా బుద్ధి చెబుతుందని డూండి రాకేష్ హెచ్చరించారు.

Tags

Be the first to react

Latest