వైసీపీ నేత భూమి కబ్జాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు.. అగ్రిమెంట్ ఇచ్చినా ఆన్‌లైన్ చేయని రెవెన్యూ.!
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకని కవిత నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తాము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని, తమ బంధువైన చుండి మల్లికార్జున అనే వ్యక్తి నుండి 2022వ సంవత్సరంలో 23 గదుల బేసిమట్టం వేసి ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశాం.
- రాజమండ్రి K-5 ఇసుక ర్యాంప్లో వైసీపీ రౌడీషీటర్ల అక్రమాలు.. చర్యలు తీసుకోవాలంటూ వినతి..
- వీఆర్వోతో కుమ్మక్కై 20 ఎకరాల వారసత్వ భూమి ఆక్రమణ.. న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి..
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకని కవిత నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తాము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని, తమ బంధువైన చుండి మల్లికార్జున అనే వ్యక్తి నుండి 2022వ సంవత్సరంలో 23 గదుల బేసిమట్టం వేసి ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశాం. తన ఇద్దరు మగపిల్లలు కాగా, అందులో చిన్న అబ్బాయి మతిస్థిమితం లేనివాడు. అలాగే ఇంట్లో ఒక వృద్ధురాలు కూడా ఉన్నారు. ఇటువంటి దీనస్థితిలో ఉన్న తమ పేద కుటుంబం కొనుగోలు చేసిన స్థలాన్ని, అదే గ్రామానికి చెందిన కోనంకి మాధవరావు అనే వైసీపీ ముఖ్య నాయకుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు.
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను, ధన బలాన్ని అడ్డుపెట్టుకుని తన కుటుంబాన్ని అక్కడ ఇల్లు కట్టుకోనివ్వకుండా మాధవరావు అడ్డుకున్నాడు. ప్రతిరోజూ మద్యం సేవించి తమను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, కించపరుస్తూ, చంపేస్తామని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా, తమపైనే పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక, నిస్సహాయ స్థితిలో తమ కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడగా... స్థానిక బంధువులు అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు కార్మిక, కర్మాగారాల, బాయిలర్స్, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ బీ.టి. నాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జె.బి. గిరిధర్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..కోటిలింగాల పరిధిలోని K-5 ఇసుక ర్యాంప్ తొలుత అంబేద్కర్ చైతన్య సంఘానికి కేటాయించబడింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసోసియేషన్లకు నేరుగా ఇవ్వకూడదనే కారణంతో, అప్పట్లో జాయింట్ కలెక్టర్ సమక్షంలో కుదిరిన ఇరుపక్షాల ఒప్పందం ప్రకారం.. సభ్యులందరినీ 'గుర్రం జాషువా ఎస్సీ ఫీల్డ్ లేబర్ సొసైటీ'లో చేర్చారు. తనను ఆ సొసైటీకి ప్రెసిడెంట్ గా నియమించి ర్యాంప్ అనుమతులు పొందారు. కాని, ర్యాంప్ ప్రారంభమైన 20 రోజుల్లోనే వైసీపీకి చెందిన వల్లూరి రాజకుమార్, అతని తమ్ముళ్లు వల్లూరి అరుణ్ కుమార్, వల్లూరి జ్యోతిబాబు (రౌడీ షీటర్లు) రంగంలోకి దిగి అక్రమాలకు తెరలేపారు.
అసలైన సభ్యులెవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సొసైటీ నుండి తొలగించారు. అంతేకాకుండా, గత నెల (10-06-2026) ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఎలక్షన్ ఆఫీసర్ గా చూపిస్తూ, ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, డీసీఓ అనుమతి లేకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి తనను పదవి నుండి తొలగించారు. ప్రస్తుతం ఆ ర్యాంప్ ను అజమాయిషీ చేస్తున్న గుర్రం జాషువా సొసైటీకి ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అర్హతలూ లేవు. ఆ సొసైటీలో 80 శాతం మంది మహిళా ఫీల్డ్ లేబర్లు ఉన్నారని, వారి వద్ద బోట్లు గానీ, లైసెన్సులు గానీ, ఇసుక నామలు గానీ లేవు. పైగా ర్యాంప్ కు వెళ్లే బాటపై కోర్టు స్టే ఉండటం వల్ల రవాణాకు కూడా వీలులేదు.
రౌడీ షీటర్లయిన వల్లూరి సోదరులు మహిళలను అధికారుల వద్దకు పంపి తప్పుడు కేసులు పెట్టిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ర్యాంప్ ను ఇతరులకు అమ్ముకోవాలని చూస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం వల్ల తాము కొత్తగా 'అన్బేద్కర్ చైతన్య సాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ (Regd. No: D-2655)' ను ఏర్పాటు చేసుకున్నామని.. తమ వద్ద 100 శాతం ఎస్సీ బోట్స్మెన్ సభ్యులు, బోట్ లైసెన్సులు, ఇసుక నామలు, బాట ఎన్ఓసీ, ప్రభుత్వం కేటాయించిన 22 × 15 మీటర్ల భూమి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గుర్రం జాషువా సొసైటీ అనుమతులను రద్దు చేసి, అర్హత కలిగిన తమ సొసైటీకి K-5 కోటిలింగాల ర్యాంప్ ను కేటాయించాలని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన నీలం యల్లమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..టి. వీరాపురం రెవెన్యూ పరిధిలోని పాత సర్వే నెం. 26 (ప్రస్తుత సర్వే నెంబర్లు 117, 118) లో తమ అత్త సుంకమ్మ, మామ కొల్లారప్పల పేరు మీద 20 ఎకరాల 75 సెంట్ల విస్తీర్ణంలో వారసత్వ భూమి ఉంది. అయితే, తమ అనుమతి లేకుండా స్థానిక వీఆర్వో తో కుమ్మక్కై, బీమప్పగారి కొల్లారప్ప అనే వ్యక్తి ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్ రికార్డుల్లో తన పేరు మీద నమోదు చేయించుకున్నాడు. అదేవిధంగా, సదరు సర్వే నెంబర్లలోని మరో 2.00 ఎకరాల భూమిని కె.ఎన్. చిరంజీవి బాబు అనే వ్యక్తి కూడా అక్రమంగా ఆన్లైన్ లో ఎక్కించుకున్నాడు. తమ వారసత్వ భూమిని అక్రమంగా ఆన్లైన్ లో ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించినందుకు... సదరు వీఆర్వో, అక్రమార్కులు బీమప్ప, చిరంజీవి బాబులు కలిసి తమను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ, చంపేస్తామని బెదిరింపులకు దిగారు. సదరు ముగ్గురు వ్యక్తుల నుండి తనకు, తన కుటుంబానికి తీవ్ర ప్రాణహాని ఉందని, అక్రమంగా భూమిని లాక్కోవడమే కాకుండా దౌర్జన్యానికి దిగుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండంకు చెందిన పిరభి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నెంబర్ 1800/1 పరిధిలో ఉన్న 1.30 సెంట్ల భూమిని గత కొంతకాలంగా తానే స్వయంగా సాగు చేసుకుంటున్నాను. అయితే, రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో మాత్రం ఈ భూమి 'అల్లా ప్రకాష్ ' అనే వ్యక్తి పేరు మీద నమోదై ఉంది. ఈ విషయమై స్థానిక వీఆర్వో, ఎంఆర్వో గార్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా జరిపారు. ప్రస్తుత రికార్డుల్లో పేరున్న అల్లా ప్రకాష్ కూడా ఈ భూమిపై ఒక అగ్రిమెంట్ రాసిస్తూ.. సదరు 1.30 సెంట్ల భూమిని అసలు సాగుదారురాలైన తన పేరు మీదకు మార్చడానికి (ఆన్లైన్ రికార్డుల్లో ఎక్కించడానికి) తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రెవెన్యూ అధికారుల సమక్షంలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆన్లైన్ రికార్డుల్లో మార్పు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నీహళ్ళి గ్రామానికి చెందిన వడ్ల తిక్కస్వామి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..సర్వే నెం. 189/A మొత్తం 0.84 ఎకరాల భూమికి గాను, 0.73 ఎకరాలను కురువ మల్లికార్జున, చాకలి వీరేష్ అనే వ్యక్తులకు విక్రయించగా.. తనకు ఇంకా 0.11 ఎకరాల భూమి మిగిలి ఉంది. సర్వే నెం. 9A2Aలో 1.42 ఎకరాల భూమి ఉంది. సర్వే నెం. 203/Aలో తనకు రావాల్సిన భూమిలో కొంత భాగం మాత్రమే ఆన్లైన్ లో ఉంది. ఇంకా 0.22 ఎకరాల భూమి నమోదు కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆన్లైన్ రికార్డుల్లో మాత్రం కేవలం సర్వే నెం. 9ZA నందు 0.40 ఎకరాలు, సర్వే నెం. 203/A నందు 0.70 ఎకరాలు మాత్రమే నమోదై ఉంది. మిగిలిన భూమి ఆన్లైన్ లో ఎక్కలేదు. ఈ భూములకు సంబంధించి తన వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్టర్డ్ పత్రాలు, ప్రభుత్వ సర్వేయర్ కొలిచి ఇచ్చిన హద్దుల పటము (ఎఫ్.ఎంబీ), రిపోర్టు అన్నీ ఉన్నాయి. ఈ సమస్యపై గత మూడేళ్లుగా తహశీల్దారు, సబ్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ, పలుమార్లు విన్నవించుకున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తన వద్ద ఉన్న పక్కా ఆధారాలను పరిశీలించి ఆన్లైన్ లో తన పేరున భూమిని నమోదు చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా అక్కమ్మపల్లి గ్రామానికి చెందిన వన్నూర్ వలి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..కూడేరు మండలం, బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 187/1 లో తమకి 68 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి పూర్వం నుండి తన తాతగారైన చిన్నవన్నూరప్ప పేరు మీద ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో నమోదై ఉండేది. కాగా, తాతగారు జీవించి ఉన్న సమయంలోనే (10-12-2020 న) ఈ 68 సెంట్ల భూమిని తన పేరు మీదకు మారుస్తూ అధికారికంగా రిజిస్టర్డ్ వీలునామా రాసిచ్చారు. అయితే, కూడేరు మండలానికి చెందిన రెవెన్యూ అధికారులు తనకు ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసులు గానీ ఇవ్వకుండా ఏకపక్షంగా ఆన్లైన్ రికార్డుల నుండి వారి తాతగారి పేరును తొలగించారు. ఆ భూమిని అక్రమంగా 'నీరజ', 'సుధాకర్' అనే వ్యక్తుల పేరిట ఆన్లైన్ లో నమోదు చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ సాంబశివరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన రీ-సర్వేలో తీవ్ర తప్పులు దొర్లాయి. ఆ సర్వే లోపాలను ఆసరాగా చేసుకొని, పెండ్యాల పున్నయ్య, పోకూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయమై తాను స్థానిక మండల సర్వేయర్ను సంప్రదించగా, వారు వచ్చి భూమిని కొలిచారని.. అయితే తనకున్న పొలంలో 8 సెంట్ల భూమిని తగ్గించి చూపించారు. సర్వే లోపాల వల్ల తగ్గిన ఆ 8 సెంట్ల భూమిని పున్నయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని, దీనివల్ల తాను తీవ్రంగా నష్టపోయానని వివరించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున తమయందు దయవుంచి తన భూమిని మరోసారి నిష్పక్షపాతంగా రీ-సర్వే చేయించి, తనకు న్యాయం చేయాలని కోరాడు.
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం బాలిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల వెంకటేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ప్రభుత్వం వారు తనకు డి-నమూనా ద్వారా (DKT నెం. 73/1403) తమ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1155/6 లో 2.00 ఎకరాల భూమిని మంజూరు చేశారు. ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిన నాటి నుండి నేటి వరకు తానే స్వయంగా సాగు చేసుకుంటూ, అనుభవంలో ఉన్నాను. ప్రస్తుతం ఆ భూమిని తన పేరు మీద ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయమని అధికారులను అభ్యర్ధిస్తే పట్టించుకోవడం లేదు. కావున తమయందు దయవుంచి తన భూమికి సంబంధించిన అన్ని పాత రికార్డులను పరిశీలించి, ఆన్లైన్ భూ రికార్డుల్లో తన పేరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లా అక్కమ్మపల్లి గ్రామానికి చెందిన వన్నూర్ వలి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..కూడేరు మండలం, బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 187/1 లో తమకి 68 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి పూర్వం నుండి తన తాతగారైన చిన్నవన్నూరప్ప పేరు మీద ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో నమోదై ఉండేది. కాగా, తాతగారు జీవించి ఉన్న సమయంలోనే (10-12-2020 న) ఈ 68 సెంట్ల భూమిని తన పేరు మీదకు మారుస్తూ అధికారికంగా రిజిస్టర్డ్ వీలునామా రాసిచ్చారు. అయితే, కూడేరు మండలానికి చెందిన రెవెన్యూ అధికారులు తనకు ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, నోటీసులు గానీ ఇవ్వకుండా ఏకపక్షంగా ఆన్లైన్ రికార్డుల నుండి వారి తాతగారి పేరును తొలగించారు. ఆ భూమిని అక్రమంగా 'నీరజ', 'సుధాకర్' అనే వ్యక్తుల పేరిట ఆన్లైన్ లో నమోదు చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన అనకల రామలక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన కుమార్తె విష్ణుప్రియకు టి. లింగందిన్నె గ్రామానికి చెందిన పోచన సుబ్బారెడ్డితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పెళ్లయిన కొంతకాలం నుంచే భర్త సుబ్బారెడ్డి భార్యను అనుమానిస్తూ, తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తూ భౌతిక దాడులు చేయడం ప్రారంభించాడు. గతంలో ఈ విషయమై అప్పటి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి హితబోధ చేసినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ తర్వాత బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో... గత రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ఎస్పీ గారికి కూడా వినతిపత్రం సమర్పించాం. అప్పట్లో రుద్రవరం ఎస్ఐ కూడా సదరు వ్యక్తిని పిలిచి హెచ్చరించారు. అయినప్పటికీ, గత వారంలో భర్త మళ్లీ విష్ణుప్రియపై తీవ్రమైన వేధింపులకు దిగాడు. ఈ విషయమై స్థానిక పోలీసులకు, పెద్దమనుషులకు సమాచారం అందించినా తక్షణ చర్యలు తీసుకోలేదని, తన కూతురి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏసుప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ అన్నయ్య గారి పేరున 1.00 ఎకరాల పొలం ఉంది. అయితే, రెవెన్యూ రికార్డులైన అడంగల్ లో ఈ భూమి పొరపాటున 'ప్రభుత్వ భూమి'గా నమోదైంది. ఈ రికార్డుల తప్పులను సరిదిద్దేందుకు తాము గుంటూరు వెస్ట్ మండల తహశీల్దార్ గారికి దరఖాస్తు చేసుకున్నాం. అర్జీని పరిశీలించిన తహశీల్దార్ గారు క్షేత్రస్థాయి విచారణ జరిపి, సదరు భూమి రికార్డుల సవరణకు సంబంధించి తమకు అనుకూలంగా రిపోర్టు కూడా ఇచ్చారు. కానీ, తహశీల్దార్ ఇచ్చిన సానుకూల నివేదికను ఆమోదించి రికార్డులు సవరించాల్సింది పోయి.. గుంటూరు ఆర్డీఓ గారు గత రెండేళ్లుగా ఆ ఫైలును పెండింగ్లో పెట్టి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react