గూగుల్ గత వారం కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వరుసగా చేసిన అప్‌డేట్‌లతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సెలవుల సీజన్‌కు ముందు వినియోగదారులకు మరింత వేగంగా తెలివిగా పనిచేసే AI అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని నోట్బుక్‌ఎల్‌ఎమ్, జెమినై, గూగుల్ ఫోటోస్, డీప్‌మైండ్, మెసేజెస్ వంటి పలు ప్లాట్‌ఫారమ్‌ల్లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది.
ఈ అప్‌డేట్‌లు సాధారణ వినియోగదారుల నుంచి ప్రొఫెషనల్స్ వరకూ అందరికీ ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవడం టెక్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.గూగుల్ నోట్బుక్‌ఎల్‌ఎమ్ ఈసారి అత్యధికంగా అప్‌డేట్‌లతో ఆకర్షిస్తుంది. ఫోల్డర్ల కోసం మిలియన్ల వినియోగదారులు ఎదురుచూస్తున్నప్పటికీ, గూగుల్ ఆ ఫీచర్‌ను విడుదల చేయకపోయినా, దాని స్థానంలో ఐదు కొత్త ఫీచర్లను ప్రకటించింది.
చాట్ హిస్టరీ బ్యాక్ అప్, వీడియో స్టైల్ ఓవర్వ్యూస్, ఇమేజ్-ఏజ్-సోర్స్, డీప్ రిసర్చ్ ఇంటిగ్రేషన్, ఫ్లాష్‌కార్డ్స్ మరియు క్విజ్‌లను ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి తేవడం పలు వర్గాల్లో సానుకూల ప్రతిస్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్‌ను నేర్చుకునే వారికి ఇదొక గొప్ప ముందడుగు.
గూగుల్ ఫోటోస్ కూడా పెద్ద ఎత్తున మార్పులు చవిచూసింది. నానో బనానా అనే కొత్త AI మోడల్‌ను యాప్‌లోకి తీసుకురావడం ద్వారా ఫోటోలను కేవలం ఒక టెక్స్ట్ కమాండ్‌తో ఎడిట్ చేసే సౌకర్యం కల్పించింది. ఫోటోల మీద Ask బటన్‌ను యాడ్ చేయడం ద్వారా చిత్రంలోని విషయాలు తెలుసుకోవడం, దానికి సంబంధిత ఫోటోల్ని శోధించడం, ఎడిట్ సెటప్‌ను వివరించుకోవడం మరింత సులభమైంది. అలాగే ‘క్రియేట్ ట్యాబ్’లో AI టెంప్లేట్‌లను జోడించడం ద్వారా ప్రజాదరణ పొందిన స్టైల్‌ల్లో ఫోటోలు మార్చే అవకాశాలు విస్తరించాయి.
మరో ముఖ్యమైన అప్‌డేట్ గూగుల్ మెసేజెస్ యాప్ నుండి వచ్చింది. రీమిక్స్ అనే కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు చాట్‌లోని ఏ చిత్రాన్నైనా రీఇమాజిన్ చేసుకునే అవకాశం పొందారు. ఒక ఫోటోపై లాంగ్ ప్రెస్ చేస్తే రీమిక్స్ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే చిత్రం AI ద్వారా కొత్త స్టైల్‌ల్లో మారిపోతుంది. ఇది సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు ఖచ్చితంగా ఆకర్షణీయమైన ఫీచర్.
జెమినై యాప్‌కు కూడా పెద్ద అప్‌డేట్‌లు వచ్చాయి. కొత్తగా VEO 3.1 మోడల్‌ను జతచేయడం ద్వారా వీడియో జనరేషన్‌లో మరింత శక్తివంతమైన కన్ట్రోల్ వచ్చింది. ముందుగా ఒకే రిఫరెన్స్ ఇమేజ్‌ను మాత్రమే ఉపయోగించగలిగే వినియోగదారులు ఇప్పుడు అనేక రిఫరెన్స్‌లను అప్‌లోడ్ చేసి మరింత ఖచ్చితమైన వీడియో కంటెంట్ తయారు చేసుకోవచ్చు.
అదనంగా, షాపింగ్ ఫీచర్‌ను జెమినైలో ప్రవేశపెట్టడం అమెరికాలో పెద్ద స్పందన తెచ్చుకుంది. ఉత్పత్తుల తులన, ధరల చార్ట్‌లు, ప్రొడక్ట్ ఇన్‌స్పిరేషన్ అని ఒకే చాట్ విండోలో చూపించే విధంగా రూపుదిద్దుకుంది. గూగుల్ సెర్చ్‌లోని AI మోడ్‌కు కూడా రెండు పెద్ద ఏజెంటిక్ ఫీచర్లు వచ్చాయి. మొదటిది Agentic Checkout ఇది వినియోగదారు పేర్కొన్న ధరకు ఒక ఉత్పత్తి చేరితే ఆటోమేటిక్‌గా కొనుగోలు చేసే అధునాతన సదుపాయం.
రెండోది Let Google Call ఇది స్థానిక స్టోర్లకు AI ఆటోమేటిక్‌గా కాల్ చేసి స్టాక్ వివరాలు, ధరలు, రిజర్వేషన్లు వంటి వివరాలను సేకరించి వినియోగదారునికి అందిస్తుంది. డీప్‌మైండ్ విడుదల చేసిన SIMA 2 మోడల్ మరో ముఖ్యమైన ప్రకటన.
ఇది జెమినై ఆధారంగా పనిచేసే AI ఏజెంట్, వీడియో గేమ్‌లలో పూర్తిగా ఆటోమేటిక్‌గా ఆడగలదు. పలు విభిన్న ప్రపంచాలను అనుభవిస్తూ AI ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో పరిశీలించేందుకు దీన్ని తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్ రోబోటిక్స్ సిస్టమ్‌లకు ఇది మెదడుగా పనిచేయగలదని భావిస్తున్నారు.
సమగ్రంగా చూస్తే గూగుల్ యొక్క ఈ వారం అప్‌డేట్‌లు AI దిశలో కంపెనీ వేస్తున్న దూకుడు అడుగుల్ని చూపిస్తున్నాయి. నోట్బుక్‌ఎల్‌ఎమ్ అభివృద్ధి, ఫోటోస్ కొత్త సామర్థ్యాలు, మెసేజెస్‌లో సృజనాత్మక ఫీచర్లు, జెమినైలో శక్తివంతమైన ఏజెంటిక్ సామర్థ్యాలు ఇవి అన్నీ AI వినియోగాన్ని సాధారణ ప్రజల జీవితాల్లో మరింత దగ్గరగా తీసుకువస్తున్నాయి.