శీతాకాలం మొదలైతే చాలా మందికి వచ్చే సాధారణ సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. పాదాల వెనుక భాగం పొడిబారడం వల్ల చిన్న చిన్న గీతలు ఏర్పడి, తరువాత అవి పెద్ద పగుళ్లుగా మారతాయి. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పగుళ్లలో చీము, నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు? ఇక్కడ తెలుసుకోండి.
శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి?
వాతావరణం పొడి కావడం
చలికాలంలో గాలిలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మంలోని సహజ తేమ కూడా తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, గట్టిపడడం, చివరకు మడమలు పగిలిపోవడం జరుగుతుంది.
అధిక బరువు
శరీర బరువు ఎక్కువైతే పాదాలపై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఒత్తిడి మడమల ప్రాంతంలో చర్మం తెరుచుకునేలా చేస్తుంది.
కొన్ని చర్మ సమస్యలు
సోరియాసిస్, ఎక్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఉన్నవారిలో మడమలు వేగంగా పగిలే అవకాశం ఉంది. అదేవిధంగా డయాబెటిస్, థైరాయిడ్ ఉన్నవారికి కూడా ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది.
సరైన చెప్పులు ధరించకపోవడం
చాలా గట్టిగా ఉండే చెప్పులు, నాణ్యత లేని బూట్లు, లేదా పూర్తిగా పాదాన్ని కవర్ చేయని చెప్పులు ధరించడం వల్ల మడమలు రక్షణ లేకుండా పొడిబారి పగిలిపోతాయి.
తక్కువగా నీరు తాగడం
చలికాలంలో చాలా మంది మినరల్ వాటర్ తాగడం తగ్గిస్తారు. దీని వల్ల శరీరంలో తేమ తగ్గి చర్మం పొడిగట్టుగా మారుతుంది.
ఇంట్లోనే చేయగల సులభమైన చికిత్సలు
గోరువెచ్చని నీటిలో పాదాల ముంచివేత
ప్రతిరోజూ 10–15 నిమిషాలు గోరువెచ్చని నీటిలో పాదాలు ముంచితే గట్టిపడిన చర్మం మారి పగుళ్లు తగ్గుతాయి.
స్నానం తర్వాత నూనె లేదా లోషన్ వాడటం
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లేదా మంచి మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
పండిన అరటిపండును మెత్తగా చేసి మడమలకు రాసి 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద జెల్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి రాత్రిపూట మడమలకు అప్లై చేసి సాక్స్ వేసుకుని నిద్రపోతే మడమలు త్వరగా మాడిపోతాయి.
నాణ్యమైన బూట్లు, చెప్పులు వేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా చలికాలంలో పాదాలను కవర్ చేసే చెప్పులు ఉపయోగపడతాయి. రోజంతా సరిపడా నీరు తాగితే చర్మం సహజంగా హైడ్రేట్ అయి పగుళ్లు తగ్గుతాయి.
మడమల పగుళ్లు సాధారణమైనప్పటికీ, చీము, ఎక్కువ నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను ఇంట్లోనే సులభంగా నియంత్రించుకోవచ్చు.
ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్యం ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించవలెను