LIVE
IndiGo fligth: హై అలర్ట్.. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... టాయిలెట్ లో కలకలం రేపిన నోట్!  •  Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  అమెరికా మిస్సైల్ దాడిలో విశాఖ యువకుడి దుర్మరణం... చంద్రబాబు ఆరా!!  •  Jobs: దుబాయ్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.1.12 లక్షల జీతం... గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!  •  Amaravathi Works: అమరావతి నిర్వాసితులకు గుడ్ న్యూస్... ఏడాది పాటు నెలకు రూ.10 వేల అద్దె!  •  Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!  •  Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! కేవలం 30 రోజుల్లో..  •  AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!  •  H1B Visa: వీసా బాదుడుకు యూఎస్ కోర్టు బ్రేక్... వెనక్కి తగ్గని ట్రంప్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. అభివృద్ధి దిశగా ఏపీ ప్రయాణం: సీఎం చంద్రబాబు!

Chandrababu: ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా కాకుండా బాధ్యతగా భావించి పాలన ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో నిర్వహించిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు.

Kasthuri S 2 min read
Chandrababu
Chandrababu

రెండేళ్ల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: చంద్రబాబు..

గెలుపు కాదు.. ప్రజలు ఇచ్చిన బాధ్యత: రెండేళ్ల పాలనపై చంద్రబాబు..

తిరుపతి: ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా కాకుండా బాధ్యతగా భావించి పాలన ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం దామినీడులో నిర్వహించిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా బాధ్యతతో పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

2024 ఎన్నికల్లో ప్రజలు 57 శాతం ఓట్లతో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారని, ఆ విజయాన్ని ప్రజలు అప్పగించిన బాధ్యతగా స్వీకరించామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడే సమయంలో అనేక రంగాలు సంక్షోభంలో ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని వివరించారు.

గత పాలనలో రాష్ట్రం అప్పులు, సమస్యలు ఎదుర్కొందని ఆరోపించిన సీఎం.. పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. వ్యవస్థలను బలోపేతం చేసి శాంతిభద్రతలను పునరుద్ధరించామని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా రూ.65 వేల కోట్ల పెన్షన్లు అందించామని, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు కేంద్రంతో కలిసి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

రైతులకు ధాన్యం డబ్బులు వేగంగా చెల్లిస్తున్నామని, గీత కార్మికులు, వడ్డెర్లు, అర్చకులు, మైనారిటీ వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. సోలార్ రూఫ్‌టాప్ పథకాల ద్వారా ప్రజలకు విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ సంజీవని ప్రాజెక్టును ప్రారంభించామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు, పోలీసు నియామకాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించామని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

రాయలసీమను హార్టికల్చర్, డ్రోన్, డిఫెన్స్ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, పుట్టపర్తిలో రక్షణ రంగ ప్రాజెక్టులు, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. కర్నూలు జిల్లాలో బంగారు గని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి నీళ్లు తీసుకువచ్చామని, కల్యాణి డ్యామ్ ద్వారా నీటి వనరులను మెరుగుపరుస్తామని సీఎం చెప్పారు. భూ వివాదాల పరిష్కారం కోసం రీసర్వే కార్యక్రమం చేపట్టామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు.

విద్యుత్ రంగంలో ప్రజలపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం భారం భరిస్తోందని చెప్పారు.

ఎమ్మెల్యేలు ప్రజల సేవకులుగా వ్యవహరించాలి తప్ప పెత్తందారులుగా మారకూడదని సీఎం సూచించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం పాజిటివ్ పాలిటిక్స్ నమ్ముతుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తోందని అన్నారు. మేనిఫెస్టో అమలుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకారంతో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాల్లో పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.

విజయోత్సవ సభలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. తల్లికి వందనం, ప్రకృతి వ్యవసాయం, ఇళ్ల పథకం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి కార్యక్రమాల వల్ల పొందిన ప్రయోజనాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

మాజీ ముఖ్యమంత్రి జగన్ డీఎస్సీ విషయంలో తప్పుడు ప్రచారం చేసి, అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని, దీనికి…

AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!

AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!

AP Farmers: ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ తదితర ఆర్థిక సంస్థల మోసాలకు గురైన డిపాజిటర్లకు సత్వర న్యాయం…

Chandrababu: ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు!

Chandrababu: ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు!

Chandrababu: ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్ర…

Nara Lokesh: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

Nara Lokesh: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారన…