Nara Lokesh: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. “కార్యకర్తే అధినేత” అనే భావనకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెబుతూ, వైసీపీ హయాంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు.
కార్యకర్తే అధినేత అన్న మాటకు నిదర్శనం.. వీరాంజనేయులుకు ఉద్యోగ నియామకం..
వైసీపీ అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు.. హామీని నెరవేర్చిన లోకేష్..
అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా మంత్రి నారా లోకేష్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. “కార్యకర్తే అధినేత” అనే భావనకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెబుతూ, వైసీపీ హయాంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు.
వైసీపీకి చెందిన వ్యక్తుల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు.
తోట చంద్రయ్య కుటుంబానికి అండగా నిలుస్తానని గతంలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియలో శాసనమండలిలో వైసీపీ నుంచి అభ్యంతరాలు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అపాయింట్మెంట్ లెటర్ అందుకున్న తోట వీరాంజనేయులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
కార్యకర్తల సంక్షేమానికి, బాధిత కుటుంబాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పాలనకు నిదర్శనంగా నిలిచిందని వారు తెలిపారు.
Tags
Be the first to react