Janasena: జనసేన లోకి దూకబోతున్న 10 మంది ఎమ్మెల్సీలు బొత్స తో పాటు? కారణాలు అవే! YCP విలవిల!
Janasena: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చుతున్నాయి. అయితే కొంతమంది స్థానిక అవసరాల దృష్ట్యా, కుటుంబ వారసులకు అవకాశాలు కల్పించాలన్న కోణంలో పార్టీలు మారుతారు అన్న ప్రచారం నడుస్తోంది.
పదిమంది ఎమ్మెల్సీలతో కలిసి జనసేనలోకి.. మండలి చైర్మన్ పదవి ఆఫర్..
ఆపై కుమార్తెకు విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ పదవి .. ఏపీ రాజకీయాల్లో సంచలనం..
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చుతున్నాయి. అయితే కొంతమంది స్థానిక అవసరాల దృష్ట్యా, కుటుంబ వారసులకు అవకాశాలు కల్పించాలన్న కోణంలో పార్టీలు మారుతారు అన్న ప్రచారం నడుస్తోంది.
ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స తన ఫ్యామిలీతో సహా జనసేనలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దానిని బలంగా ఖండించకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే బొత్స వస్తే సాధారణంగా ఉండదు అని.. ఏదో ఒక సంచలనంతోనే ఆయన జనసేనలో చేరుతారని టాక్ నడుస్తోంది.
అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. బొత్స తో పాటు ఓ పదిమంది ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఓ పదిమంది ఎమ్మెల్సీను కలుపుకొని జనసేనలో చేరితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న మండలి చైర్మన్ పోస్ట్ పోతుంది అనేది ఒక అంచనా. ఆపీఠంపై బొత్సను కూర్చోబెట్టబోతున్నారు అనేది మరో ప్రధానమైన వాదన.
ఆమోదం పొందని రాజీనామాలు..
మండలి లో ఇప్పటికే ఓ ఏడుగురు ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. దానికి కారణం మండలి చైర్మన్ మోసేన్ రాజు. ఆపై శాసనమండలి అంటేనే అధికార కూటమికి చికాకు పెట్టే అంశంగా మారింది. ఎందుకంటే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ. ప్రస్తుతం 30 మంది వరకు ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉన్నారు.
అందులో కొందరు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అంతకుముందే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తే ఆమోదం లభించలేదు. అందుకే మిగతావారు అలా అసంతృప్తితోనే వైసీపీలో కొనసాగుతున్నారు. 2028 వరకు మండలిలో వైసీపీ బలం కొనసాగితే ఇబ్బందికరం అని టిడిపి కూటమి భావిస్తోంది. అందుకే వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
మండలి చైర్మన్ పదవి ఆఫర్..
బొత్స సత్యనారాయణ శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే తామేదో గొప్ప పదవి ఇచ్చామని వైసిపి భావిస్తోంది. కానీ అంతకుముందే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పట్లో అది ముఖ్యమంత్రికి సమానమైన పదవి. అయితే ఇప్పుడు బొత్స తన కుటుంబాన్ని.. తన వారసుల కోసం పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా జనసేనలో చేరితే పదవులతో పాటు గౌరవం దక్కుతుంది. కుమార్తె డాక్టర్ అనూష కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా అవకాశం ఇస్తారు.
ఆపై మండలి చైర్మన్ గా బొత్సకు పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన పార్టీ మారడం విషయంలో జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నిస్తే చాలా తేలికగా తీసుకున్నారు. బలంగా ఖండించలేదు కూడా. అయితే ఇప్పుడు ఓ పదిమంది ఎమ్మెల్సీలను తనతో పాటు జనసేనలోకి తీసుకెళ్తారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
Tags
1 readers have reacted