India Gate: మోదీ కోసం తయారు చేసిన ‘ఇండియా గేట్’ చాక్లెట్.. భారత్‌కు చేరకముందే..

India Gate: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వినూత్న కానుక ఇవ్వాలని భావించిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. మోదీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఇండియా గేట్’ ఆకారంలోని చాక్లెట్ భారత్‌కు చేరకముందే మార్గమధ్యంలో కరిగిపోయింది. దీంతో ఆ ప్రత్యేక కానుకను మోదీకి అందించలేకపోయారు.

India Gate Belgium Chocolate
India Gate Belgium Chocolate

ప్రత్యేక కానుకగా ఇవ్వాలనుకున్న బెల్జియం ప్రధాని.. మార్గమధ్యంలోనే పాడైన చాక్లెట్..

బెల్జియం ప్రధాని వినూత్న కానుక.. మోదీ కోసం చేసిన ఇండియా గేట్ చాక్లెట్‌కు ఏమైంది?

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వినూత్న కానుక ఇవ్వాలని భావించిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. మోదీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఇండియా గేట్’ ఆకారంలోని చాక్లెట్ భారత్‌కు చేరకముందే మార్గమధ్యంలో కరిగిపోయింది. దీంతో ఆ ప్రత్యేక కానుకను మోదీకి అందించలేకపోయారు.

భారత్ పర్యటన సందర్భంగా మోదీకి ఈ ప్రత్యేక చాక్లెట్‌ను బహుమతిగా ఇవ్వాలని బెల్జియం ప్రధాని భావించారు. ఇందుకోసం అత్యుత్తమ నాణ్యత కలిగిన బెల్జియం చాక్లెట్లతో ఇండియా గేట్ ప్రతిరూపాన్ని తయారు చేయించారు.

భారత్‌కు చేరకముందే కరిగిపోయిన కానుక
అయితే చాక్లెట్‌ను బెల్జియం నుంచి భారత్‌కు తీసుకొచ్చే సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణంలోనే చాక్లెట్ కరిగిపోయి దెబ్బతింది. దీంతో దానిని ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వడం సాధ్యం కాలేదు.

ఈ విషయాన్ని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ సరదాగా వెల్లడించారు. ‘‘ఇండియా గేట్‌ను అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో రూపొందించి మోదీకి కానుకగా ఇవ్వాలని అనుకున్నా. అసలైన ఇండియా గేట్ చెక్కుచెదరకుండా ఉంది. కానీ చాక్లెట్‌తో చేసిన ప్రతిరూపం మాత్రం భారత్‌కు చేరుకునేలోపే పాడైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మరో ప్రతిరూపం బెల్జియంలో సిద్ధంగా ఉందట
కానుకగా ఇవ్వాలనుకున్న చాక్లెట్ కరిగిపోయినప్పటికీ, వెవర్ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. మరో ఇండియా గేట్ చాక్లెట్ ప్రతిరూపం బెల్జియంలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దానిని ఎలాగైనా సురక్షితంగా ప్రధాని మోదీకి అందిస్తానని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన చాక్లెట్ ప్రతిరూపం చిత్రాన్ని భారత్‌లోని బెల్జియం దౌత్యకార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రత్యేక ఆకృతిలో రూపొందించిన ఈ చాక్లెట్ సోషల్ మీడియాలో కూడా ఆసక్తిని రేకెత్తించింది.

ఇండియా గేట్ వెనుక భారత సైనికుల త్యాగం
మోదీ కోసం ఎంచుకున్న ఇండియా గేట్‌కు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉంది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియంలో పోరాడిన భారత సైనికుల త్యాగానికి గుర్తుగా ఇండియా గేట్‌ను నిర్మించారు. అందుకే భారత్‌కు చెందిన ఈ చారిత్రక కట్టడాన్ని చాక్లెట్ రూపంలో రూపొందించి మోదీకి కానుకగా ఇవ్వాలని బెల్జియం ప్రధాని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కానుక కరిగిపోయిన ఘటన కొంత నిరాశ కలిగించినా, దానిని సరదాగా స్వీకరించిన బెల్జియం ప్రధాని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారత్–బెల్జియం సంబంధాల్లో స్నేహపూర్వకతను చాటే ఈ చిన్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Tags

Be the first to react

Latest