అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రధానంగా హెచ్1బీ వీసాదారులు స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాలో కాలు పెట్టేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికాను వీడొద్దని, వెళ్తే తిరిగి రావడం అంత సులువు కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్1 బీ వీసాదారులు చెప్పినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన ప్రస్తుతం అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారని వార్తా కథనం తెలిపింది. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ తమ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే భారత ఎంబసీ అధికారులు కూడా ఎన్నారైలను అప్రమత్తం చేశాయి.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: