Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! UAE: అంతర్జాతీయంగా హై అలర్ట్... యూఏఈ తీరంలో కంటైనర్ నౌకపై దాడి! Tech War: ఐటీ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ప్లాన్..! పశ్చిమాసియాలో టెక్ వార్! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Israel Vs Iran: మ్యాప్‌లో లేకుండా పోతున్న ఇరాన్ నగరాలు? 10,000 ప్రాంతాలు నేలమట్టం! Sleeper Cell Alert: నిద్రాణ ముఠాల వేటలో అమెరికా..! ఖమేనీ మరణం తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతలు! Iran -Israel: ఇరాన్ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు: 1900 మంది సైనికులు మృతి! Indian Embassy: సౌదీలో మనవారంతా క్షేమం.. పుకార్లను నమ్మవద్దన్న భారత విదేశాంగ శాఖ! Trump: ఇరాన్ నేతలకు ట్రంప్ వార్నింగ్.. లొంగిపోతారా లేక సర్వనాశనం అవుతారా? Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! UAE: అంతర్జాతీయంగా హై అలర్ట్... యూఏఈ తీరంలో కంటైనర్ నౌకపై దాడి! Tech War: ఐటీ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ప్లాన్..! పశ్చిమాసియాలో టెక్ వార్! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Israel Vs Iran: మ్యాప్‌లో లేకుండా పోతున్న ఇరాన్ నగరాలు? 10,000 ప్రాంతాలు నేలమట్టం! Sleeper Cell Alert: నిద్రాణ ముఠాల వేటలో అమెరికా..! ఖమేనీ మరణం తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతలు! Iran -Israel: ఇరాన్ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు: 1900 మంది సైనికులు మృతి! Indian Embassy: సౌదీలో మనవారంతా క్షేమం.. పుకార్లను నమ్మవద్దన్న భారత విదేశాంగ శాఖ! Trump: ఇరాన్ నేతలకు ట్రంప్ వార్నింగ్.. లొంగిపోతారా లేక సర్వనాశనం అవుతారా?

War Expenses USA: యుద్ధం అంటే మామూలు ఖర్చు కాదు: తొలి 6 రోజుల్లోనే.. అమెరికా ఖజానాకు భారీ చిల్లు.!

War Expenses In USA: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అగ్రరాజ్యం అమెరికాకు చమటలు పట్టిస్తున్నాయి. గత 12 రోజులుగా ఇరాన్‌పై చేస్తున్న దాడులకు అమెరికా మంచినీళ్లలా డబ్బు ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఏకంగా 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. భా

Published : 2026-03-12 12:53:00
  • మరో 50 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాలని కాంగ్రెస్ కు ప్రతిపాదనలు..
     
  • ఇరాన్ పై దాడులకు అత్యాధునిక మిసైళ్లు ప్రయోగిస్తున్న అగ్రరాజ్యం..

War Expenses In USA: పశ్చిమాసియా (Middle East) వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ గమనాన్ని మార్చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ఈ యుద్ధం పెను సవాలుగా మారింది. యుద్ధం మొదలై కేవలం 12 రోజులే అవుతున్నా, అగ్రరాజ్యం ఖజానాకు భారీ చిల్లు పడుతోంది. అప్పుడే వేల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చయిపోతుండటంతో, అమెరికా ప్రభుత్వం ఇప్పుడు డైలమాలో పడింది. యుద్ధం అంటే కేవలం సైనికులు సరిహద్దులకు వెళ్లడం మాత్రమే కాదు, దాని వెనుక అంతులేని ఆర్థిక భారం ఉంటుంది. గత 12 రోజులుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికాకు ఖర్చు తడిసి మోపెడవుతోంది.

మొదటి ఆరు రోజుల లెక్క: యుద్ధం మొదలైన తొలి ఆరు రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం ఏకంగా 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
భారత కరెన్సీలో: మన రూపాయిల్లో లెక్కగడితే ఇది సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. అంటే రోజుకు సగటున 16 వేల కోట్ల రూపాయల పైచిలుకు కేవలం బాంబులు, క్షిపణులు మరియు ఇంధనం కోసమే ఖర్చవుతోంది. గత నెల 28న యుద్ధం మొదలైనప్పుడు అమెరికా అత్యంత వేగంగా స్పందించింది. మొదటి రెండు రోజుల్లోనే ఇరాన్‌లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసేందుకు తన దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించింది.

అత్యాధునిక ఆయుధాలు: కేవలం ఆ 48 గంటల్లోనే 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని అమెరికా వాడేసింది.
సెనేటర్ల ఆందోళన: అయితే అధికారికంగా చెబుతున్న లెక్కల కంటే క్షేత్రస్థాయిలో వాస్తవ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని సెనేటర్ క్రిస్ కూన్స్ వంటి నేతలు హెచ్చరిస్తున్నారు. అంచనాలకు అందని రీతిలో నిధులు ఖర్చయిపోతుండటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని వారు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా పంతానికి పోతుండటంతో, ఈ పోరాటం సుదీర్ఘంగా సాగే సూచనలు ఉన్నాయి.
బడ్జెట్ ప్రతిపాదనలు: ప్రస్తుత నిధులు సరిపోవని భావిస్తున్న వైట్‌హౌస్, త్వరలోనే అదనంగా 50 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపనుంది.
ఖాళీ అవుతున్న నిల్వలు: అమెరికా రక్షణ శాఖ (Pentagon) వద్ద ఉన్న ఆయుధ నిల్వలు ఇప్పటికే నిండుకుంటున్నాయని సమాచారం. ఒకవేళ యుద్ధం ఇలాగే మరికొన్ని వారాలు సాగితే, అమెరికా తన సైనిక శక్తిని తిరిగి పుంజుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యుద్ధం ప్రభావం కేవలం ఆయుధాలకే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
చమురు నిల్వల విడుదల: అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్నంటకుండా ఉండేందుకు, తన దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) మార్కెట్లోకి విడుదల చేసేందుకు ట్రంప్ యంత్రాంతం సిద్ధమవుతోంది.
భారత్ పై ప్రభావం: అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, దాని ప్రభావం భారత్ లోని పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతుంది. ఇది చివరకు సామాన్యుడి నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణమవుతుంది.

యుద్ధం వల్ల ఏ దేశానికీ శాశ్వత లాభం ఉండదు. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఆర్థికంగా ఒత్తిడికి గురవుతోంది. ట్రంప్ ప్రభుత్వం చర్చల ద్వారా శాంతిని నెలకొల్పుతుందా లేక మరిన్ని నిధులు కుమ్మరించి యుద్ధాన్ని కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న పెద్ద ప్రశ్న. యుద్ధ మేఘాలు త్వరగా విడిపోయి, ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరిగినా, దాని ప్రభావం మాత్రం మనందరి జేబుల మీద పడుతుంది.
 

Spotlight

Read More →