Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! KootuPodi: ఇంట్లోనే English ఘుమఘుమలాడే కూటు పొడి... పది నిమిషాల్లో తయారయ్యే సులభమైన రెసిపీ! Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! Tomato Niluwa Pachdi: టమాటో నిలువ పచ్చడి: ఒక్కసారి చేస్తే నెల రోజుల వరకు... తక్కువ నూనె, ఎక్కువ రుచి! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! KootuPodi: ఇంట్లోనే English ఘుమఘుమలాడే కూటు పొడి... పది నిమిషాల్లో తయారయ్యే సులభమైన రెసిపీ! Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! Tomato Niluwa Pachdi: టమాటో నిలువ పచ్చడి: ఒక్కసారి చేస్తే నెల రోజుల వరకు... తక్కువ నూనె, ఎక్కువ రుచి! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా!

Tomato Stuffed Curry: కేవలం పది నిమిషాల్లో.. టమాటాతో రొటీన్ కూరలు తిని బోర్ కొట్టిందా? ఈ ‘గుత్తి టమాటా మసాలా’ ట్రై చేయండి!

Tomato Stuffed Curry In Telugu: మనందరి ఇళ్లలోనూ ప్రతిరోజూ ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న - "ఈరోజు కూర ఏం చేయాలి?". ఫ్రిజ్ తెరిచి చూస్తే ఎక్కువగా కనిపించేవి టమాటాలే. అటువంటప్పుడు రొటీన్ గా చేసే టమాటా పప్పు లేదా టమాటా పచ్చడి కాకుండా, ఏదైనా స్పెషల్ గా చేయాలనిపిస్తే 'గుత్తి టమాటా మసాలా కర్రీ' ఒక అద్భుతమైన ఆప్షన్.

Published : 2026-03-09 11:00:00
  • చిన్న టమాటాలతో పెద్ద మ్యాజిక్: బిర్యానీ, పుల్కాల్లోకి అదిరిపోయే మసాలా కర్రీ రెసిపీ..
     
  • ఈరోజు కూర ఏం చేయాలి? అనే ప్రశ్నకి సమాధానం.. నోరూరించే ఈ స్పెషల్ టమాటా కర్రీ!

Tomato Stuffed Curry In Telugu: మనందరి ఇళ్లలోనూ ప్రతిరోజూ ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న - "ఈరోజు కూర ఏం చేయాలి?". ఫ్రిజ్ తెరిచి చూస్తే ఎక్కువగా కనిపించేవి టమాటాలే. అటువంటప్పుడు రొటీన్ గా చేసే టమాటా పప్పు లేదా టమాటా పచ్చడి కాకుండా, ఏదైనా స్పెషల్ గా చేయాలనిపిస్తే 'గుత్తి టమాటా మసాలా కర్రీ' ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ కూర వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, పుల్కా లేదా బిర్యానీ వంటి మసాలా రైస్ రకాల్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రేవీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
కూర రుచిగా రావాలంటే మనం ఎంచుకునే టమాటాలు ముఖ్యం. మరీ పెద్దవి కాకుండా చిన్న సైజులో ఉండే పావు కేజీ టమాటాలు తీసుకోండి.

తయారీ విధానం
1. టమాటాల తయారీ:
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి, పైన ఉండే తొడుముని కట్ చేయాలి. తర్వాత టమాటాని పూర్తిగా విడదీయకుండా, పైన నాలుగు గాట్లు పెట్టుకోవాలి (గుత్తి వంకాయకి పెట్టినట్టు). ఇలా చేయడం వల్ల మసాలా లోపలి వరకు వెళ్లి టమాటా రుచిగా ఉంటుంది.

2. అద్భుతమైన మసాలా పేస్ట్:
స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించాలి. అవి వేగాక నువ్వులు వేసి చిటపటలాడే వరకు ఫ్రై చేసి పక్కకు తీయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని, పైన చెప్పిన మసాలా దినుసులన్నీ (ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు) వేసి మొదట మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి స్మూత్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.

3. టమాటాలను మగ్గించడం:
కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, మనం గాట్లు పెట్టుకున్న టమాటాలను అందులో వేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు చల్లి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 60 నుంచి 80 శాతం వరకు మగ్గించుకోవాలి. ఇవి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టండి.

4. గ్రేవీ తయారీ:
అదే కడాయిలో మరికొంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర పోపు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలి. ఈ మసాలా నుండి నూనె పైకి తేలేంత వరకు నిదానంగా వేయించాలి. అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది.

5. వంట పూర్తి చేయడం:
మసాలా వేగాక చింతపండు రసం పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ కొంచెం ఉడుకుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా మరియు వేయించి పెట్టుకున్న టమాటాలను వేయాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి ముప్పావు కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి 5-10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి.

రుచిని పెంచే రహస్యం (Tips)
ఇలా చేస్తే ఎంతో రుచికరమైన గుత్తి టమాటా మసాలా కర్రీ రెడీ! మీ ఇంట్లో వారు కూడా డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి.

Spotlight

Read More →