Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! Tomato Niluwa Pachdi: టమాటో నిలువ పచ్చడి: ఒక్కసారి చేస్తే నెల రోజుల వరకు... తక్కువ నూనె, ఎక్కువ రుచి! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Kakarakaya karampodi: పావు కిలో కాకరకాయలతో పది మందికి భోజనం.. అదిరిపోయే కారప్పొడి రెసిపీ! ముద్ద ముద్దకీ ఆహా అనాల్సిందే.! Radish Majjiga Pulusu: వేసవి తాపాన్ని తగ్గించే టేస్టీ వంటకం! ముల్లంగి మజ్జిగ పులుసు... Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Kuttu Dahi Bhalla: చిటికెలో సిద్ధమయ్యే స్నాక్: కుట్టు పిండితో దహీ భల్లా.. తయారీ విధానం చాలా సులభం, ఆరోగ్యం కూడా.! Mango Pulihora: "ఆహా ఏమి రుచి": ఈ వేసవిలో పచ్చి మామిడికాయ పులిహోర.. ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది! Tomato Niluwa Pachdi: టమాటో నిలువ పచ్చడి: ఒక్కసారి చేస్తే నెల రోజుల వరకు... తక్కువ నూనె, ఎక్కువ రుచి! Muntha Masala Recipe: గరం గరం "ముంత మసాలా" - ఇంట్లోనే రోడ్ సైడ్ టేస్ట్ పక్కా! Kakarakaya karampodi: పావు కిలో కాకరకాయలతో పది మందికి భోజనం.. అదిరిపోయే కారప్పొడి రెసిపీ! ముద్ద ముద్దకీ ఆహా అనాల్సిందే.! Radish Majjiga Pulusu: వేసవి తాపాన్ని తగ్గించే టేస్టీ వంటకం! ముల్లంగి మజ్జిగ పులుసు...

Mutton Curry: మటన్ మసాలా ఇలా చేస్తే.. ముక్క వెన్నలా కరిగిపోవాల్సిందే! రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ ఇదే!

Mutton Curry: ఇంట్లోనే ఎంతో రుచికరమైన మటన్ మసాలాను హోటల్ స్టైల్‌లో ఎలా తయారు ప్రత్యేకమైన మసాలా పొడి, పెరుగు కాంబినేషన్‌తో గ్రేవీ చిక్కగా, ముక్క మెత్తగా వచ్చేలా చేసే సింపుల్ టిప్స్ మీకోసం. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ..

Published : 2026-03-12 16:06:00

Home Made Mutton Curry: ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియులకు  ఇళ్లలో చికెన్, ఫిష్, మటన్ ఘుమఘుమలు ఉండాల్సిందే. అయితే ప్రతిసారీ రొటీన్‌గా వండే మటన్ కర్రీ కాకుండా, రెస్టారెంట్ రుచిని తలపించేలా 'మటన్ మసాలా' లేదా 'మటన్ బూనా మసాలా'ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ ప్రత్యేకత ఏంటంటే.. ఎటువంటి మసాలాలను ముందే గ్రైండ్ చేయనక్కర్లేదు, అన్నీ అప్పటికప్పుడు వేస్తూ వండటమే..

కావాల్సిన పదార్థాలు:

అర కిలో మటన్, ఉల్లిపాయలు (పెద్దవి రెండు), అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నూనె, జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, ధనియాలు  ఉప్పు, కారం.

తయారీ విధానం ఇలా..

ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కూర టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలను గ్రైండ్ చేయకూడదు. వాటిని సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చేత్తో కొంచెం నలిపితే పొరలు విడిపోతాయి. ఇలా చేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూరకు అంత రంగు, రుచి వస్తాయి.

ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ ముక్కలను కుక్కర్‌లో వేసి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు వేయించాలి. ముక్కలు రంగు మారాక తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. ఆ వెంటనే ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

కూరలో ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో కొంచెం పుదీనా, కొత్తిమీర కాడలు వేయాలి. ఆ తర్వాత ముప్పావు కప్పు గడ్డ పెరుగును బాగా కలిపి వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఆపై అరకప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ 90 శాతం ఉడికేలా చూసుకోవాలి.

మటన్ ఉడికేలోపు మరో పక్కన మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచీలను దోరగా వేయించి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి, మనం తయారు చేసిన ఈ ఫ్రెష్ మసాలా పొడిని కూరలో కలపాలి. చివరగా కొంచెం నీళ్లు పోసి ఐదు నిమిషాలు చిన్న మంటపై ఉడికిస్తే నూనె పైకి తేలి కూర చిక్కబడుతుంది. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర చల్లుకుంటే నోరూరించే మటన్ మసాలా రెడీ! ఇది వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ లేదా పుల్కాలోకైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.‌

Spotlight

Read More →