ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు చేసిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రకటన చేశారు. నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. యూఐడీఎఫ్ కింద రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరయ్యాయన్నారు. తొలుత 49 పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.422.36 కోట్లు కేటాయించారని.. కేంద్రంతో మాట్లాడి నిధులు పెంచామన్నారు. ఇదివరకు పంపిన ప్రతిపాదనలను సవరించి 40 ప్రాజెక్టులకే ఈ మొత్తం కేటాయించామని తెలిపారు.
మరోవైపు నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 108 కిలోమీటర్ల పొడవైన నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణం జరగనుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, యువతకు అవకాశాలు సృష్టిస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్ర కేబినెట్ 4 లైన్లు బద్వేలు- నెల్లూరు కారిడార్‌కు ఆమోద ముద్ర వేయడం ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు అన్నారు. ఈ కారిడార్‌తో స్థానికంగా కనెక్టివిటీ పెరుగుతుందని.. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కారిడార్‌ను మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బద్వేల్-నెల్లూరు మధ్య నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్టును మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణపట్నం పోర్టుకు 33.9 కి.మీ దూరం తగ్గి పరిశ్రమల అనుసంధానానికి ఉపయోగంగా ఉంటుంది అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్‌కు కేంద్ర పథకాలను వాడుకోవడం చేతకాలేదన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టం జరిగిందని.. ఇప్పుడు చంద్రబాబు తెలివిగా కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తెస్తున్నారన్నారు. పోలవరం కోసం చంద్రబాబు కేంద్రంలో చాలా కష్టపడ్డారని.. ఈ ఏడాది రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. అమరావతి రింగురోడ్డుపైనా చంద్రబాబు ఓ రిక్వెస్ట్ చేశారని.. ప్రతి నియోజకవర్గంలో రూ.20కోట్ల ఉపాధి నిధులతో సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు వస్తాయన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు శుభవార్త! విశాఖ-భువనేశ్వర్ ఎయిర్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్ !
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్..! రివాల్యుయేషన్ పెట్టగా..!
ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ..! ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు..! సీఎస్ ఉత్తర్వులు జారీ!
అమెరికా మరో కీలక నిర్ణయం! విద్యార్ధి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా బ్రేక్..!
జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ! గల్ఫ్ మోసాల కేసులో..!
ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్‌డేట్ మీకోసమే..!
రూ.లక్షలోపు రుణమాఫీ.. వీరికి వర్తింపు! మార్గదర్శకాలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: