ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమైంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. లబ్ధిదారులారా, మీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరి అంటున్నారు.. మరింత సమాచారం కోసం లబ్ధిదారులు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈ పథకాల కోసం ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం తప్పనిసరిగా చేయాలని సూచించారు.. ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి ఆధార్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ (అనుసంధానం) చేసుకోవాలని సూచించారు.
అన్నదాత సుఖీభవ పథకానికి రైతుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రైతు న్యాయపరంగా వాస్తవ లబ్ధిదారుగా ఉండాలని ఆయన ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకం ఉండి, వెబ్ ల్యాండ్‌లో వివరాలు నమోదు కాని వారు కూడా అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగదు బదిలీ కోసం ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేయాలన్నారు. అలాగే ఎన్‌పీసీఐ లింకేజ్ చేయాలని.. ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్ కు బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానం, ఎన్‌పీసీఐ లింకేజ్ చేయుట తప్పనిసరి అన్నారు.
ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు జమ చేస్తారు. దీని కోసం ఎన్‌పీసీఐ మేపర్‌లో ఆధార్‌కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్, సచివాలయ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. జూన్ 5వ తేదీ లోగా అందరికీ ఆధార్ సీడింగ్‌తో పాటు ఎన్‌పీసీఐ లింకేజ్ చేస్తారు. ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాల ఫలితాలు అందుతాయి అంటున్నారు. ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీపీబీ ఖాతాలో జమ కాబడిన నగదును ఏ పోస్టాఫీసులో అయినా తీసుకోవచ్చు అంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లకు లింక్ చేసుకోవచ్చు అంటున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ఎన్‌ఈఎఫ్‌టి, ఐఎంపిఎస్, యూపీఐ కూడా చేసుకోవచ్చు అన్నారు. అందరూ తమ దగ్గరలోని పోస్టు ఆఫీసును సంప్రదించి ఐపీపీబీ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందిస్తారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.20వేలు అందిస్తామని తెలిపింది. వచ్చే నెలలో ఈ రెండు పథకాలను అమలు చేయనుంది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: