ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గడిచిన సెప్టెంబరులో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. తాజాగా వీటికి సంబంధించి జిల్లా అధికారులకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. 2017 ఏప్రిల్నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా లెక్కలు సేకరించిన ప్రభుత్వం .. రుణ మాఫీ అర్హతల పైన స్పష్టత ఇచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. తాజాగా రేవంత్ నిర్ణయంతో వృత్తి అవసరాల కోసం రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఊరట కలగనుంది. సీఎం రేవంత్రెడ్డి చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గడిచిన సెప్టెంబరులో ప్రకటించారు. తాజాగా వీటికి సంబంధించి జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 2017 ఏప్రిల్నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. తాజా నిర్ణయంతో ఒక్కో కార్మికుడికి రూ.లక్ష లోపు రుణాలు మాఫీ కానున్నాయి. మాఫీ కాక, కొత్త రుణాలు అందక కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నామని, మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు మాఫీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఇక, వీవర్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ ఖరారుకు జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయతో పాటు ఆరుగురితో కూడిన డీఎల్‌సీ (జిల్లా స్థాయి కమిటీ) ఆమోదం పొందాలి. అనంతరం చేనేత డైరెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న స్టేట్ లెవల్ కమిటీ ఆమోదం పొందితే బ్యాంక్నుంచి నో డ్యూ సర్టిఫికెట్ జారీ అవుతుంది.ప్రతి కార్మికుడికి సంబంధించిన రూ.లక్షలోపు రుణాలు (వడ్డీతో కలిపి) మాఫీ అవుతాయి. రూ.లక్ష ఆ పైన ఉన్న కార్మికులు, ఎక్కువ ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వారికి రూ.లక్ష మాఫీ కానుంది.ప్రభుత్వం ప్రకటించిన సమయంలో తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి సైతం వారి వ్యక్తిగత ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తారు.
కార్మికులు వ్యక్తి గతంగా, సొసైటీల ద్వారా రుణాలు పొందగా కేవలం వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మాత్రమే ప్రభు త్వం మాఫీ చేయనుంది. బీఆర్‌ఎస్ హయాంలో 2017మార్చి లోపు ఉన్న రుణాలు మాఫీ కాగా.. ప్రస్తుతం 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసు కున్న రుణా లను మాఫీ కానున్నాయి. కార్మికుడికి వ్యక్తిగతంగా ఎంత రుణం ఉన్నా రూ.లక్ష వరకు మాఫీ కానుంది. మాఫీ కసరత్తును ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రారంభించింది. గత డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చేనేత రుణాలకు సంబంధించిన వివరా లను తెప్పించుకున్నారు. మాఫీ అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: