తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిన్న అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ, పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, కాపలా ఉన్న కానిస్టేబుల్ దృష్టి మరలిన క్షణంలో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, పోలీసుల భద్రతా వైఫల్యంపై చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే, పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే వ్యక్తి, గల్ఫ్‌కు పంపిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన ప్రసాద్, ప్రస్తుతం జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవలే ఇతనిపై కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదైంది.
ఈ కొత్త కేసుకు సంబంధించి విచారణలో భాగంగా, కొడిమ్యాల పోలీసులు నిన్న పీటీ వారెంట్‌పై జున్ను ప్రసాద్‌ను జగిత్యాల సబ్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. కేసు వివరాలను పరిశీలించిన సంబంధిత మేజిస్ట్రేట్, ప్రసాద్‌కు రిమాండ్ విధించారు. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం, ప్రసాద్‌ను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఉన్న తన కుటుంబ సభ్యులతో ప్రసాద్ మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో, ఎస్కార్ట్‌గా వచ్చిన కానిస్టేబుల్ సాగర్, రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టు లోపలికి వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన జున్ను ప్రసాద్ కానిస్టేబుల్ సాగర్ కళ్లుగప్పి అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. కొద్దిసేపటికే విషయం గ్రహించిన పోలీసులు అప్రమత్తమై, పరారైన ఖైదీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. కోర్టు ప్రాంగణం నుంచి ఖైదీ తప్పించుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: