దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఆర్‌ఆర్‌బీ ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.
రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి స్టేజ్ 1 పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇక స్టేజ్ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: