అవినీతి కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్‌ను కోర్టు రిమాండ్ ఆదేశాలతో జైలుకు తరలించారు. 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్ ఢిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ టాక్స్ పేయర్ సర్వీస్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆదాయపన్ను నోటీసు నుంచి విముక్తి కలిగించేందుకు ఇటీవల లా పినోజ్ పిజ్జా ఫ్రాంచైజీ యజమాని సనమ్ కపూర్‌ను రూ.45 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని, భారీ జరిమానా సైతం కట్టాల్సి ఉంటుందని బెదిరించడంతో పాటు వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తొలి విడతగా రూ.25 లక్షలను మొహాలీలోని అమిత్ కుమార్ ఇంట్లో అతడి సహాయకుడు హర్ష్ కొటక్‌కు ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ కుమార్ సింఘాల్‌పై కేసు నమోదు చేశారు.
అనంతరం అమిత్ కుమార్ సింఘాల్‌కు సంబంధించి పలు నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, కోటి రూపాయల నగదు, ఒక లాకర్, పలు బ్యాంకులకు చెందిన 25 ఖాతాలను గుర్తించారు. వాటితో పాటు ఢిల్లీ, ముంబయి, పంజాబ్‌లో ఉన్న పలు చర, స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. అయితే గుర్తించిన స్థిరాస్తుల విలువ ఎంత ఉంటుందో లెక్కించే పనిలో అధికారులు ఉన్నారు.
అమిత్ కుమార్, అతడి సహాయకుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా, వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: