ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, స్త్రీ నిధి బ్యాంకు ఎండీ ప్రసాదరావు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు సహకరించాలన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహిళలకు ఇచ్చే రుణం రూ.2 లక్షలు దాటితే అదనపు రుణం కోసం ముద్ర, పీఎంఈజీపీ వంటి పథకాల ద్వారా సహాయం చేయాలని కోరారు. 'వార్షిక రుణ ప్రణాళిక, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరు తదితర అంశాలపై' సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
మరోవైపు రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు దీని కోసం పీ-4 విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయంలో ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉత్తమ విధానాలను గుర్తించి, వాటిని ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. ఈ విభాగానికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య నిపుణుడు డి.షాలెం రాజు, ఆర్థిక సలహాదారు డి.సురేంద్ర, ఆర్థిక శాఖ అధికారులు వీవీవీ సత్యనారాయణ, సీహెచ్ శ్రీనివాసులు, కన్సల్టెంట్లు ఎం వంశీకృష్ణ రెడ్డి, శోభన్ సహకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 10న ఉదయం 11.30 గంటలకు ఆమె విశాఖపట్నం చేరుకుంటారు.. స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు జార్ఖండ్‌కు బయలుదేరుతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రపతి కార్యాలయం ఆమోదం కోసం కార్యక్రమాల వివరాలను పంపాలని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టిమణికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న నూతలపాటి సౌమ్యకు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కమిషనర్ ఎ బాబు సెలవులో ఉండటంతో జూన్ 1 నుంచి 11 వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వహించగా.. తాజాగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!
నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
భారత్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్కడో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: