బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ ఆలస్యమయిందని మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ అన్నారు. త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ అవుతారని చెప్పారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని పత్తాలేకుండా పోయారని రవీంద్ర, సుభాష్ ఎద్దేవా చేశారు. చేసిన అరాచకాలకు, అకృత్యాలకు మూల్యం చెల్లించేందుకు కొడాలి నాని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడిన నేతలను ఏమీ చేయడం లేదన్న ఆగ్రహం కూటమి నేతలు, కార్యకర్తల్లో ఉందని... వల్లభనేని వంశీ అరెస్ట్ తో కూటమి శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!
మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మరో 8 నెలల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!
జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!
తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!
పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: