టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'డిక్టేటర్', 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్స్ లు బద్దలు అవ్వాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ, తమన్ ల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇక తాజాగా తమన్ కు బాలకృష్ణ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు బాలయ్య. అలాగే కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని యువ సంగీత దర్శకుడిని ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..
తమన్ కు బాలకృష్ణ కారు బహుమతిగా ఇస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో తమన్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అని అన్నారు. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కూడా తమన్ నే బాణీలు అందిస్తున్నారు. అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్స్ లు బద్దలు అవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలో తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!
మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!
ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!
పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలన్న హీరోయిన్! సోషల్ మీడియా లో వైరల్!
శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: