టోల్ రహదారులపై ప్రయాణించాలంటే కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలనే విషయం తెలిసిందే. రోడ్డుపై వాహనాలు బారులు తీరకుండా ఉండే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో ఫాస్టాగ్ కార్డు స్కాన్ ద్వారా ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. అయితే ఫాస్టాగ్‌కు సంబంధించిన నిబంధనలను మారుస్తూ తాజాగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ యూజర్లు ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్చించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ నిబంధన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఫాస్టాగ్ యూజర్లకు కొత్తగా '70 నిమిషాల' వ్యవధిని నిర్దేశించారు. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇంతకీ బ్లాక్ లిస్ట్‌లోకి ఎలా వెళ్తుందనేగా సందేహం. సాధారణంగా ఫాస్టాగ్‌లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చుతారు. దీంతో ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!
ఒకవేళ వాహనం టోల్‌ప్లాజా వద్దకు చేరుకునే సమయానికి గంట కంటే ఎక్కువ సేపు ఇన్‌యాక్టివ్‌లో ఉంటే 176 ఎర్రర్‌ను చూపి ట్రాన్సాక్షన్‌ను రిజక్ట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ మాత్రమే కాకుండా, కేవైసీ పూర్తి చేయకపోయినా, ఛాసిస్ నంబర్‌కు, వెహికల్ నంబర్‌కు మధ్య సంబంధం లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. మీరు టోల్‌గేట్ వద్దకు వెళ్లే 70 నిమిషాల ముందు ఫాస్టాగ్‌లో కచ్చితంగా సరిపడ బ్యాలెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఫాస్టాగ్‌ను చివరి నిమిషంలో రీఛార్జ్ చేసేవారు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టోల్ రీడ్ జరిగిన 10 నిమిషాల తర్వాత కూడా బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే ఆ ట్రాన్సాక్షన్‌ను రిజక్ట్ చేస్తారు. అందుకే మినిమం బ్యాలెన్స్‌తో పాటు పెండింగ్ కేవైసీని పూర్తి చేసుకున్న తర్వాత ప్రయాణమం మొదలు పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!
ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!
పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలన్న హీరోయిన్! సోషల్ మీడియా లో వైరల్!
శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: