జగన్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. రైల్వే కోర్టులో వాయిదాకు ఇవాళ(శుక్రవారం) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పుణ్యమా అంటూ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందని చెప్పారు. ఆనందయ్య మందు విషయంలో అక్రమ కేసు పెట్టారని గుర్తుచేశారు. కాకాణి ఏదేదో మాట్లాడుతున్నారని... తనకు కోట్లకు పైగా ఆస్తులున్నాయని ఆరోపణలు చేశారని అన్నారు. మలేషియాలో రూ.1000 కోట్లు ఆస్తులున్నాయని అన్నావ్. అవే ఎక్కడో చూపమంటే ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. తన అల్లుడు, తన తాత దగ్గర నుంచి వారంత కాంట్రాక్టర్లుగా ఉన్నారని వివరించారు. వారికి తాను విల్లా కొనిచ్చేదేమిటి? అని నిలదీశారు. రాందాసు కండ్రిగలో ఎకరా రూ.కోటి, లే అవుట్ వేస్తే ఎకరా రూ.3 కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. ఎకరా రూ.15లక్షలకే ఆయన లాగేసుకున్నావని విమర్శించారు. ఒక్క రోజు ముందు నీ అల్లుడు ఆ కంపెనీకి సీఈఓ, అదే రోజు ప్రభుత్వం జీవో, భూములు అప్పగింత. అదేమిటో చెప్పకుండా తనపై అర్ధం పర్ధంలేని ఆరోపణలను కాకాణి గోవర్ధన్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన పెద్దనాన్న స్వాతంత్రం కోసం జైలుకు పోయొచ్చారని గుర్తుచేశారు. రూ.కోట్ల విలువ చేసే తమ సొంత భూములు పేదల ఇళ్లు, స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చామని గుర్తుచేశారు. కాకణి కుమార్తె బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2014, 2019, 2024లో కాకాణి గోవర్ధన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక ఆఫీసు కొనుక్కుంటే తప్పా అని ప్రశ్నించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిగ్గూ శరం లేదని విమర్శించారు. స్వాతంత్రానికి ముందు తమకు ఫారిన్ కారు ఉండేదని... సినిమా హాలు, భూములు అమ్ముకున్నామని తెలిపారు. జగన్ హయాంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందు అల్లుడికి రూ.కోట్ల భూములు దోచిపెట్టావ్. మళ్లీ మాట్లాడుతావా? అని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!
మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?
వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..
ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: