ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మొత్తం 1941.19 ఎకరాల భూసమీకరణ చేపట్టనుంది. ఈ భూసమీకరణ ప్రక్రియ విశాఖ గ్రోత్ హబ్‌లో భాగంగా జరుగుతోంది. వీఎంఆర్‌డీఏ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.
జిల్లాలవారీగా భూసమీకరణ వివరాలు: విశాఖపట్నం జిల్లా (ఆనందపురం, పద్మనాభం మండలాలు): 1132 ఎకరాలు అనకాపల్లి జిల్లా (సబ్బవరం, అనకాపల్లి మండలాలు): 783.69 ఎకరాలు విజయనగరం జిల్లా (డెంకాడ, భోగాపురం మండలాలు): 25.41 ఎకరాలు
మొత్తం 13 గ్రామాల్లో భూములను స్వచ్ఛందంగా సమీకరించనున్నారు. ఈ భూసమీకరణను 2016 వుడా భూసమీకరణ పథకం కింద అమలు చేస్తారు.
రైతులకు లాభాలు: డీపట్టా భూమికి బదులుగా 900 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ లభిస్తుంది. ఆక్రమిత భూమికి ఎకరాకు 450 గజాల ప్లాట్ కేటాయిస్తారు.
గ్రామసభలు, అభ్యంతరాల స్వీకరణ: ప్రకటన విడుదల నేపథ్యంలో, ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గ్రామసభలు సెప్టెంబరు 4 నుంచి అక్టోబరు 3 వరకు జరుగనున్నాయి.
తేదుల వారీగా గ్రామసభలు: అనకాపల్లి జిల్లా: సెప్టెంబర్ 4 – అక్టోబర్ 3 వరకు. విశాఖపట్నం జిల్లా: గిడిజాల: సెప్టెంబర్ 6. గోరింట: సెప్టెంబర్ 9
శొంఠ్యం: సెప్టెంబర్ 10
బీడీపాలెం: సెప్టెంబర్ 11
కొవ్వాడ: సెప్టెంబర్ 6
విజయనగరం జిల్లా: సెప్టెంబర్ 4 – అక్టోబర్ 3 మధ్య. అభ్యంతరాలపై అక్టోబర్ 3 నుంచి 18 వరకు సంబంధిత ఎమ్మార్వో కార్యాలయాల్లో విచారణ జరుగుతుంది.