Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!

తమిళ స్టార్ హీరో సూర్య స్థాపించిన **'అగరం ఫౌండేషన్'**‌కి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చెన్నైలో జరిగిన కార్యక్రమం చాలా భావోద్వేగంగా సాగింది. ఈ ఫౌండేషన్ ద్వారా వైద్యులుగా మారిన 51 మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతున్నపుడు, తమ సఫలత కథలు పంచుకుంటున్న సమయంలో సూర్య భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!

‘అగరం ఫౌండేషన్’ ద్వారా సూర్య ఇప్పటివరకు 8వేల మంది విద్యార్థులకు విద్య సాయం అందించారు. ఈ ఫౌండేషన్ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, చదువుకోవాలనే ఆశ కలిగిన పిల్లలకు ఆధారంగా నిలిచింది. స్కూల్, కాలేజ్ చదువుల్లోనూ, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ అగరం ద్వారా ఎంతోమందికి మార్గదర్శనంగా మారారు.

House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు, “మేము ఇవాళ వైద్యులమయ్యే స్థాయికి రావడం సూర్య అన్నగారి కారణం” అని పేర్కొంటూ, అతనికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ల మాటలు విన్న సూర్య, "నేను నటుడిగా పొందిన వంద బహుమతులు కంటే, మీరు చెప్పిన ఒక్క మాట ఎక్కువ విలువైనది" అంటూ భావోద్వేగంతో స్పందించారు.

Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!

ఈ పోస్ట్ కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు స్పందిస్తూ, "ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ లక్షల మందికి జీవనదీపంగా మారిన సూర్య నిజంగా దేవుడే", "సేవ చేస్తూ నీళ్లు పెట్టుకునే హీరో నువ్వే" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #15YearsOfAgaramFoundation అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

సూర్య నటుడిగా ఎన్నో విజయాలను సాధించినా, ఆయన చేసిన సామాజిక సేవే ప్రజల మనసుల్లో మరింత స్థానం సంపాదించుకుంది. అగరం ఫౌండేషన్‌ని కేవలం ఓ పేరు కోసం కాకుండా, నిజమైన మార్పు కోసం నడిపిస్తున్నాడు. ఇది యూత్‌కు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

Free admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్... ఆ రూల్ ఛేంజ్!
Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..
Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!
Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!
UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!